Bindu Madhavi: బిగ్ బాస్ విన్న‌ర్‌పై నోరు పారేసుకున్న నెటిజ‌న్స్.. చెప్పుతో కొట్టిన‌ట్టు బ‌దులిచ్చిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bindu Madhavi: బిగ్ బాస్ విన్న‌ర్‌పై నోరు పారేసుకున్న నెటిజ‌న్స్.. చెప్పుతో కొట్టిన‌ట్టు బ‌దులిచ్చిందిగా..!

Bindu Madhavi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షో ఇప్ప‌టికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని ఆరో సీజ‌న్‌కి సిద్ధం అవుతుంది. అయితే ఇటీవ‌ల బిగ్ బాస్ నాన్‌స్టాప్ కార్య‌క్ర‌మం కూడా జ‌రిగింది. ఇందులో బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు చరిత్ర‌లో తొలిసారి లేడి విన్న‌ర్ కావ‌డం అంద‌రిని ఆనందానికి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :4 August 2022,12:20 pm

Bindu Madhavi : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షో ఇప్ప‌టికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని ఆరో సీజ‌న్‌కి సిద్ధం అవుతుంది. అయితే ఇటీవ‌ల బిగ్ బాస్ నాన్‌స్టాప్ కార్య‌క్ర‌మం కూడా జ‌రిగింది. ఇందులో బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింది. బిగ్ బాస్ తెలుగు చరిత్ర‌లో తొలిసారి లేడి విన్న‌ర్ కావ‌డం అంద‌రిని ఆనందానికి గురి చేసింది. తెలుగులో అనీష్ కురువిల్ల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన తొలి ప్రయత్నం `ఆవకాయ బిర్యానీ`. ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి బిందు మాధవి.

Bindu Madhavi : బిందు ఆన్ ఫైర్..

ఆ తరువాత బంపర్ ఆఫర్, రామ రాయ కృష్ణ కృష్ణ చిత్రాల్లో నటించింది. కొంత విమరాం తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన `పిల్ల జమీదార్`లోనూ మెరిసింది. అయితే తెలుగులో ఆ తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు మకాం మార్చేసింది. బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్న దగ్గరి నుంచి నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్ లో వుంటోంది. బిగ్ బాస్ లో తనని ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడిన బిందు ఆడపులి అనిపించుకుంది. తాజాగా తన డ్రెస్సింగ్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై బిందు మాధవి ఘాటుగా స్పందించింది.

bindu madhavi fire on netizens

bindu madhavi fire on netizens

వేసుకున్న దుస్తులని బట్టి ఇచ్చే గౌరవం తనకు అక్కర్లేదన్నారు. కొంత మంది నెటిజన్లు బిందు మాటలకు సపోర్ట్ గా నిలిచి అభినందిస్తుండగా మరి కొంత మంది మాత్రం మిమ్మల్ని అలాంటి ఫ్యాషన్ డ్రెస్సుల్లో చూడలేకపోతున్నామంటూ కామెంట్ లు చేస్తున్నారు. కాగా, ఓ నెటిజన్ బిందు మాధవి డ్రెస్సింగ్ పై అసహనం వ్యక్తం చేశాడు. `బిగ్ బాస్ లో వున్నప్పుడు ఆమెను చూస్తే నాకు ఎంతో ఆనందంగా అనిపించేదని హౌస్ లో వున్న వాళ్లంతా ఎక్స్పోజ్ చేసేలా డ్రెస్ లు వేసుకున్నప్పటికీ బిందు మాధవి మాత్రం సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించేవారన్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది