Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీలో పాయల్ రాజ్‌పుత్ ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తుందో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: May 20, 2022, 3:30 pm

Bigg Boss OTT Telugu : బుల్లితెర బిగ్ రియాలీటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ ఫైట్ ఉత్కంఠగా మారింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో 12 వారాలుగా సాగుతున్న ఈ ఆట చివరి అంకానికి చేరుకుంది. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్స్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. మిత్రా శర్మ, అనీల్ రాథోడ్, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, యాంకర్ శివ, అఖిల్ సార్ధక్, బిందు మాధవి ఈ ఏడుగురు బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. ఈసారి చివరి వారంలో కూడా ఏడుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోనే ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈ సీజన్‌లో లేనేలేదు. శనివారం (మే 21) సాయత్రం బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది.

ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ పోల్ స్టార్ట్ కాగా.. బుధవారంతో ముగిసింది ప్రతిసారి దాదాపు వారం రోజులు పాటు ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లో ఉండేవి. కానీ విన్నర్ ఎవరో తేల్చే ఓటింగ్ లైన్స్ మాత్రం కేవలం నాలుగు రోజులకే పరిమితం చేశారు. అయినప్పటికీ కూడా ఓట్లు కోట్లు దాటుతున్నాయి. ప్రతి సీజన్‌లో ఆడియన్స్ నుంచి కోట్లాది ఓట్లు వస్తుండగా.. నాన్ స్టాప్ ఓటింగ్‌కి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ ప్రకారం ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారు..? ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందనేది ఆస‌క్తిక‌రంగా మారింది.ఈ క్ర‌మంలో చాలా మంది త‌మ ఫేవ‌రేట్స్ కంటెస్టెంట్స్‌ని స‌పోర్ట్ చేస్తున్నారు.

Payal Rajput supports to Bigg Boss OTT Telugu Bindu Madhavi

Payal Rajput supports to Bigg Boss OTT Telugu Bindu Madhavi

Bigg Boss OTT Telugu : ట‌ఫ్ ఫైట్..

తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్‌ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది. బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా‍గ్రామ్‌లో బిందు ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నువ్వు టైటిల్‌ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్‌ చేసింది పాయల్‌. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్‌ గెలవలేదు. అనీల్ రాథోడ్‌కి అందరికంటే తక్కువ ఓట్లు పడుతుండటంతో అతను ఏడో స్థానంలో ఉన్నాడు. అతని తరువాత మిత్రా శర్మకి తక్కువ ఓట్లు పడుతున్నాయి.. ఆమె ఆరో స్థానంలో ఉంది. ఇక టాప్ 5 విషయానికి వస్తే.. బాబా భాస్కర్ ఐదో స్థానంలో ఉంటే.. అరియానా గ్లోరి నాలుగో స్థానంలో ఉంది. యాంకర్ శివ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టైటిల్ కోసం బిందు మాధవి, అఖిల్ సార్ధక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

Sam C

No bio available for this author.

  1. "Meta : మెటాకు భారీ షాక్.. రూ.2.2 లక్షల కోట్ల జరిమానా వెనుక అసలు కేసు ఇదే!"

  2. "YS Jagan YS Sharmila : షర్మిల కూతురి పెళ్లికి జగన్ ఇల్లు ఇవ్వలేదా? అసలు కారణంపై ఆసక్తికర చర్చ"

  3. "Ysrcp : కడప గడ్డపై వైసీపీకి ఘోర పరాభవం.. ఒక్క నామినేషన్ కూడా పడకపోవడం వెనుక అసలు నిజాలివే..!"

  4. "Rashmika Mandanna : తెలంగాణ కోడలిగా బతుకమ్మ ఆడిన రష్మిక.. నెట్టింట రచ్చ లేపుతున్న నేషనల్ క్రష్ పిక్స్..!"

  5. "Punganur Municipal Elections : పుంగనూరులో తోకముడిచిన పెద్దిరెడ్డి? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బకు వైసీపీ ఖేల్ ఖతం..!"

  6. "Charlotte Telugu Sambaralu 2026 : షార్లెట్‌లో తెలుగు సంబరాలు 2026 ఘనంగా.. మిషిగన్‌లో నాట్స్ కొత్త చాప్టర్ ప్రారంభం"

  7. "NATS : అమెరికా తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం.. సాయి గంగులకు కీలక బాధ్యతలు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp