Bindu Madhavi : ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసిన బిగ్ బాస్ విన్న‌ర్.. మైండ్ బ్లాక్ అయిపోవ‌ల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bindu Madhavi : ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసిన బిగ్ బాస్ విన్న‌ర్.. మైండ్ బ్లాక్ అయిపోవ‌ల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 August 2022,7:20 pm

Bindu Madhavi : బిందు మాధ‌వి.. ఈ ముద్దుగుమ్మ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బిగ్ బాస్ నాన్‌స్టాప్ విన్న‌ర్‌గా అవ‌త‌రించిన బిందు మాధ‌వి ఇటీవ‌లి కాలంలో తెగ సంద‌డి చేస్తుంది. చదువుకునే రోజుల్లోనే బిందు మాధవి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే శరవణ స్టోర్స్ కోసం పలు యాడ్స్ చేసింది. ఆ తర్వాత అలా ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. అనంతరం కమల్ కామరాజు హీరోగా నటించిన ‘అవకాయ్ బిర్యానీ’ సినిమాతో బిందు మాధవి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది.తెలుగులో చాలానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ‘బంపర్ ఆఫర్’, ‘ఓం శాంతి’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘ప్రతి రోజు’, ‘పిల్ల జమిందార్’ వంటి సినిమాల్లో నటించింది. వీటిలో పెద్దగా విజయాలు లేకపోవడంతో బిందు మాధవికి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు దూరంగా ఉండిపోయింది.

Bindu Madhavi : బిందు ర‌చ్చ‌…

తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉన్న బిందు మాధ‌వి త‌మిళంలో మాత్రం అల‌రిస్తూనే ఉంది. ‘పొక్కిశామ్’ అనే సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. అందులో చాలా వరకూ విజయాలు ఉండడంతో ఈమె క్రేజ్ కూడా భారీగా పెరిగింది. దీంతో స్టార్‌డమ్‌ను అందుకుని ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది. బిందు మాధవి 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆటతీరుతో పాటు మంచి వ్యక్తిత్వంతో విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. ఫలితంగా ఈ అమ్మడు ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, చివర్లో మాత్రం ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

bindu madhavi stylsih looks are stunning

bindu madhavi stylsih looks are stunning

ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై సందడి చేయకున్నా.. బిందు మాధవి మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసింది. బిందు మాధ‌వి బోల్డ్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో బిందు మాధ‌వి ఆ రేంజ్‌లో అందాలు ఆర‌బోయ‌లేదు. కాని తాజా పిక్స్ చూసి షాక్ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది