Bithiri Sathi : బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల గత దశాబ్ద కాలంగా బుల్లి తెరపై సందడి చేస్తున్నాడు. వీ6 లో అనూహ్యంగా ఛాన్స్ దక్కడంతో అక్కడ ఎంట్రీ ఇచ్చిన రవి అక్కడ నుండి సత్తిగా మారి పోయాడు. బిత్తిరి సత్తిని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఆయన్ను తెలుగు ప్రేక్షకులు మా వాడు అన్నట్లుగా భావించారు. అందుకే బిత్తిరి సత్తికి మంచి క్రేజ్ దక్కింది. తెలంగాణ మాండలికం లో మాట్లాడుతూ నవ్వు తెప్పించడం తో పాటు ఆలోచింపజేసే విధంగా పంచ్ లు వేసే బిత్తిరి సత్తి ముందు ముందు టీవీలో కనిపించబోడట.
ఔను.. వీ6 నుండి టీవీ9కి షిప్ట్ అయిన బిత్తిరి సత్తి… టీవీ9 నుండి సాక్షికి షిప్ట్ అయ్యాడు. ఇప్పుడు సాక్షి ని వదిలేసిన ఆయన ఏ ఒక్క ఛానల్ లో కూడా జాయిన్ అవ్వలేదట. ఈమద్య కాలంలో బిత్తిరి సత్తి మార్క్ కామెడీకి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కార్యక్రమాల రేటింగ్ పెద్దగా రావడం లేదు. అందుకే బిత్తిరి సత్తి తనకు తాను బుల్లి తెరను వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు వస్తున్న ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా కాదంటున్నాడట.సాక్షి టీవీ లో ఆయన చేస్తున్న కార్యక్రమంకు దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది.
అందుకే చేసేది లేక గుడ్ బై చెప్పేయాలని భావిస్తున్నాడట. టీవీ లో వస్తున్న బిత్తిరి సత్తిని జనాలు ఆధరించడం తగ్గింది. అందుకే సినిమాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలంగా సినిమాలను చేస్తూ ఆయన బిజీగా ఉన్నాడు. సినిమాల్లో ఇకపై ఫుల్ గా బిజీ అవ్వాలని భావిస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ముందు ముందు కూడా బిత్తిరి సత్తి మరిన్ని సినిమాల్లో కనిపించబోతున్నాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.