Bithiri Sathi : బిత్తిరి సత్తి టీవీకి బై బై చెప్పేశాడు.. నెక్ట్స్ ఏంటీ?

 Authored By prabhas | The Telugu News | Updated on :16 April 2022,7:01 pm

Bithiri Sathi : బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల గత దశాబ్ద కాలంగా బుల్లి తెరపై సందడి చేస్తున్నాడు. వీ6 లో అనూహ్యంగా ఛాన్స్ దక్కడంతో అక్కడ ఎంట్రీ ఇచ్చిన రవి అక్కడ నుండి సత్తిగా మారి పోయాడు. బిత్తిరి సత్తిని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఆయన్ను తెలుగు ప్రేక్షకులు మా వాడు అన్నట్లుగా భావించారు. అందుకే బిత్తిరి సత్తికి మంచి క్రేజ్ దక్కింది. తెలంగాణ మాండలికం లో మాట్లాడుతూ నవ్వు తెప్పించడం తో పాటు ఆలోచింపజేసే విధంగా పంచ్ లు వేసే బిత్తిరి సత్తి ముందు ముందు టీవీలో కనిపించబోడట.

ఔను.. వీ6 నుండి టీవీ9కి షిప్ట్‌ అయిన బిత్తిరి సత్తి… టీవీ9 నుండి సాక్షికి షిప్ట్‌ అయ్యాడు. ఇప్పుడు సాక్షి ని వదిలేసిన ఆయన ఏ ఒక్క ఛానల్‌ లో కూడా జాయిన్ అవ్వలేదట. ఈమద్య కాలంలో బిత్తిరి సత్తి మార్క్ కామెడీకి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కార్యక్రమాల రేటింగ్‌ పెద్దగా రావడం లేదు. అందుకే బిత్తిరి సత్తి తనకు తాను బుల్లి తెరను వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు వస్తున్న ప్రతి ఒక్క ఆఫర్‌ ను కూడా కాదంటున్నాడట.సాక్షి టీవీ లో ఆయన చేస్తున్న కార్యక్రమంకు దారుణమైన రేటింగ్‌ నమోదు అవుతుంది.

bithiri sathi good bye to sakshi tv

bithiri sathi good bye to sakshi tv

అందుకే చేసేది లేక గుడ్‌ బై చెప్పేయాలని భావిస్తున్నాడట. టీవీ లో వస్తున్న బిత్తిరి సత్తిని జనాలు ఆధరించడం తగ్గింది. అందుకే సినిమాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలంగా సినిమాలను చేస్తూ ఆయన బిజీగా ఉన్నాడు. సినిమాల్లో ఇకపై ఫుల్‌ గా బిజీ అవ్వాలని భావిస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ముందు ముందు కూడా బిత్తిరి సత్తి మరిన్ని సినిమాల్లో కనిపించబోతున్నాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి