Priyamani : బిత్తిరి సత్తి మాటలకి ఫుల్లుగా నవ్వుకున్న ప్రియమణి ..!
Priyamani : సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం ఓటీటీ సబ్జెక్టులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. గ్లామరస్ గా కనిపిస్తునే మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ప్రియమణి కి మంచి క్రేజ్ వచ్చింది. నేషనల్ వైడ్ గా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆహాలో ఆమె చేసిన భామ కలాపం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనికి రెండవ సీజన్ తాజాగా విడుదలైంది. ఫిబ్రవరి 16 నుంచి ‘ భామ కలాపం 2 ‘ స్ట్రీమింగ్ అవుతుంది. రెండవ సీజన్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వెబ్ సిరీస్ హిట్ అయిన సందర్భంగా తాజాగా ఈ సినిమాలో నటించిన ప్రియమణి, శరణ్య, సీరత్ కపూర్ బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి పలు ప్రశ్నలు అడగగా దానికి సమాధానాలు ఇచ్చారు.
ఇక భామ కలాపంలో ప్రియమణి యూట్యూబ్ ద్వారా వంటలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంటారు. అయితే బయట కూడా మీరు వంట చేస్తారా అని అడిగితే అందుకు ప్రియమణి నేను వంట చేయనని కేవలం తిని పెడతానని చెప్పారు. ఇక తన భర్త యుఎస్ లో ఉంటారని నేనెప్పుడూ సింగిల్ గానే ఉంటానని తెలిపారు. అయితే బిత్తిరి సత్తి మీరు హాలీవుడ్లో సినిమాలు చేయండి. మీ భర్త మీరు కలిసి ఉండొచ్చు అని సరదాగా అంటాడు. దానికి ప్రియమణి హాలీవుడ్ లో ట్రై చేయాలి అని ఆమె నవ్వుతూ చెప్పారు. ఇక ఈ భామ కలాపం 2 లో శరణ్య ప్రియమణికి పార్ట్నర్స్ గా నటించారుష మొదటి సీజన్లో పనిమనిషిగా చేసిన శరణ్య రెండవ సీజన్లో ప్రియమణికి పార్ట్నర్ గా చేశారు.
మొదటి సీజన్ లో గుడ్డు ని కీలకంగా తీసుకొని సస్పెన్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇక రెండో సీజన్లో కోడిని సస్పెన్స్ థ్రిల్లర్గా తీశారు. ఈ భామ కలాపం 2 కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భామ కలాపం మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ మరింత డబల్ థ్రిల్ ఉంటుందని ప్రియమణి చెప్పుకొచ్చారు. ఈసారి ఇంకొన్ని పాత్రలను యాడ్ చేశామని సీరత్ కపూర్ చక్కగా నటించారని తెలిపారు. ప్రస్తుతం ప్రియమణి ఓటీటీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాలను తగ్గించేశారు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ఆమె వరల్డ్ వైడ్ గా ఆకట్టుకున్నారు. ఇక తెలుగులో భామ కలాపం మొదటి సీజన్తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు భామ కలాపం 2 తో కూడా ఆకట్టుకుంటున్నారు. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న భామ కలాపం సూపర్ హిట్ అని అంటున్నారు. సీజన్ వన్ కి మించి సీజన్ 2 ఉందని దర్శకుడు అభిమన్యు అద్భుతంగా స్టోరీ ని మలుపు తిప్పారని అంటున్నారు.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.