Karthika Deepam 2 : త్వరలో కార్తీకదీపం 2 .. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఉంటారా మరి .. ?
Karthika Deepam 2 : బుల్లితెరపై ‘ కార్తీకదీపం ‘ సీరియల్ ఒక సెన్సేషన్. జనవరిలో ఈ సీరియల్ కి ముగింపు పలికారు. అయితే కార్తీకదీపం 2 వస్తుందంటూ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ పార్ట్ 2 లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఉంటారా అని సందేహాలు వచ్చాయి. అయితే దీనిపై డాక్టర్ బాబు స్వయంగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్ ఏళ్ల తరబడి ప్రేక్షకుల మదిని దోచింది. టిఆర్పీ లో నేషనల్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. 2017లో స్టార్ మా లో కార్తీకదీపం మొదలైంది. 2023 వరకు మొత్తం 1569 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఈ సీరియల్ సక్సెస్ వెనుక అందులోని పాత్రలు కారణం అయ్యాయి. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ మూడు పాత్రలు జనాలకి నచ్చాయి.
డాక్టర్ బాబు వంటలక్కను తమ ఇంట్లో మనుషులుగా భావించేవారు. మోనితను శత్రువుగా ఫీల్ అయ్యేవారు. ఈ మూడు పాత్రలు లేకుండా కార్తీకదీపం పై ప్రయోగం చేశారు. డాక్టర్ బాబు కూతుళ్లు అయిన శౌర్య, హిమలను పెద్దవాళ్లుగా చూపించారు. డాక్టర్ బాబు, వంటలక్క కారు ప్రమాదంలో మరణించినట్లు చూపించి ఆ పాత్రలకు ఎండ్ కార్డు చూపించారు. కానీ ఆ ప్రయోగం ఫలించలేదు. డాక్టర్ బాబు, వంటలక్కలేని కార్తీకదీపం చూడలేవని ప్రేక్షకులు తేల్చారు. కార్తీకదీపం ముగిసి ఏడాది కాలం తర్వాత కార్తీకదీపం 2 ప్రకటించారు. త్వరలో స్టార్ మా లో ఈ సీరియల్ రెండో భాగం ప్రసారం కానుంది.
తాజాగా ప్రోమోను కూడా విడుదల చేశారు. దీనికి విశేష స్పందన వస్తుంది. ప్రోమో లో ఒక పాపను తప్పితే ఇతర పాత్రలను చూపించలేదు. డాక్టర్ బాబు, వంటలక్క పార్ట్ 2 లో ఉంటారా అని సందేహాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ మీడియా డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ పాత్ర చేసిన నిరుపమ్ పరిటాలను సంప్రదించింది. కార్తీకదీపం 2 లో తాను నటిస్తున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే వంటలక్క పాత్ర చేసిన ప్రేమీ విశ్వనాధ్ సైతం నటిస్తున్నారని ఆయన తెలిపారట. అలాగే విలన్ పాత్ర చేసిన మోనిత అలియాస్ శోభా శెట్టి కూడా సీరియల్ లో ఉన్నారట. అదే సమయంలో ఆ పాత్రలు నిరూపమ్, ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి చేస్తున్నారట. ఇక ఇది కార్తీకదీపం సీరియల్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సక్సెస్ఫుల్ పాత్రలను వదులుకోవడం ఇష్టం లేదని స్టార్ మా కార్తీకదీపం తోనే తెరపైకి తీసుకొచ్చింది. మరి పార్ట్ 2 ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్‌తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
This website uses cookies.