Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షోకు ఎంత మంది ఆడియన్స్ అయితే ఉన్నారో అంతే స్థాయిలో విమర్శించే వారూ ఉన్నారు. ఇప్పటికే పలువురు సామాజిక వేత్తలతో పాటు రాజకీయ నాయకులు షో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ షో పై విరుచుకుపడుతూ సి.పి.ఐ నారాయణ.. కోర్టులో కేసు కూడా వేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ షో పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో గురించి ముఖ్యంగా రవి ఎలిమినేషన్ గురించి రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి ఎలిమినేషన్ పక్కా అన్ ఫెయిర్ అంటూ… బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
రవి తెలంగాణకు చెందిన వ్యక్తి అయిన ఒకే ఒక్క కారణంతో గేమ్ మంచిగా ఆడుతున్నప్పటికీ అతడిని కావాలని ఎలిమినేట్ చేశారని ఆరోపించారు. అసభ్యకరంగా నడుచుకునే వారిని మాత్రమే హౌస్ లో ఉంచుతున్నారని మండి పడ్డారు. అసలు షో లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. అయినా బిగ్ బాస్ వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారంటూ నిర్వాహకులను నిలదీశారు. షో ను బ్యాన్ చేయవలసిందిగా కేంద్రానికి సూచించ నున్నట్లు తెలిపారు.
19 మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ – 5 చివరి దశకు చేరుకుంది. ఎవరూ ఊహించని రీతిలో ఒక్కొకరు ఎలిమినేట్ అవుతూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ వారం రవి హౌస్ నుంచి బయటకు వచ్చిన విధానం అతని అభిమానులను నిరాశ పరిచింది. రవి నిష్క్రమణ ఓటింగ్ పరంగా జరగలేదని అతని అభిమానులు బిగ్ బాస్ టీమ్ పై మండి పడుతున్నారు. రవి లేని షో ను తాము ఇక చూడబోమని అంటున్నారు
విన్నర్ కాదు కదా… కనీసం టాప్ 5 కి కూడా చేరుకొకపోయినా రవికి అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ముట్టిందని తెలుస్తోంది. టాప్ సెలబ్రిటీ హోదాలో హౌస్ లోకి అడుగు పెట్టిన యాంకర్ రవికి వారానికి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల మధ్యలో అప్పజెప్పారని సమాచారం. ఎలిమినేట్ అయ్యే నాటికి అంటే పన్నెండు వారాలకు గాను రవికి దాదాపు రూ. 80 లక్షల నుంచి రూ. 96 లక్షల వరకు అందిదని టాక్ నడుస్తోంది. అంటే బిగ్బాస్ విజేతకు ఇచ్చే రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కన్నా రవి రెమ్యునరేషన్ రెట్టింపు కావడం గమనార్హం.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.