pushfaraj seeks the help of bahubali
Pushpa : చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య పోటీ కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటుంది. కానీ, వ్యక్తిగతంగా వారంతా కలిసే ఉంటారు. అన్న, తమ్ముడు, బాబాయ్, మామ అని పిలుచుకుంటారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుంటారు. సినిమా ఆడియో ఫంక్షన్లకు అథితులుగా వస్తుంటారు. వారి సినిమాల కోసం ప్రమోషన్స్ సైతం చేస్తుంటారు. ఈ రకమైన ఫ్రెండ్లీ నేచర్ ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తోంది. మొన్న ‘అఖండ’ సినిమా ప్రమోషన్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించిన విషయం తెలిసిందే. నందమూరి అభిమానులకు ఎంతో హుషారు తెప్పించారు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఆయన సినిమాకు బాహుబలి ప్రభాస్ సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో బన్నీకి జోడిగా హీరోయిన్ రష్మిక నటిస్తున్న విషయం తెలింసిందే. ఫస్ట్ టైం బన్నీ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధం అవుతుండగా.. అందుకు సంబంధించి మూవీ యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర బృందం.. ఈ క్రమంలోనే పుష్పకు సంబంధించి టీజర్, పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. అందుకోసమే డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేశారట..
pushfaraj seeks the help of bahubali
ఈ ఫంక్షన్‌కు బాహుబలి మూవీతో పాన్ ఇండియా రేంజ్‌ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రభాస్ ను కోరగా డార్లింగ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభాస్ నిజంగా వస్తే పాన్ ఇండియా రేంజ్ హీరోతో ప్రమోషన్ చేయిస్తే తప్పుకుండా పుష్పకు మార్కెట్ పెరుగుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.. ఆఫ్ స్క్రీన్‌లో బన్నీ, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. దీంతో ప్రభాస్ కూడా బన్నీకి సాయం చేసేందుకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది.
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
This website uses cookies.