Janvi kapoor : ఆ స్టార్ హీరో తో అస్సలు నటించొద్దు .. జాన్వి కపూర్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన బోనీకపూర్ ..

Authored By aruna | The Telugu News | Published on: September 12, 2023, 11:00 am

Janvi kapoor : అలనాటి తార శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆమె మన మధ్య లేకపోయినా ఆమెను తలుచుకుంటూనే ఉంటారు అభిమానులు. ఇక ఆమె కూతురిగా జాన్వి కపూర్ సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన జాన్వి కపూర్ కి హిందీలో సరైన హిట్టు పడలేదు. అయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవలే టాలీవుడ్లోకి కూడా ఎంటర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ దేవర ‘ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది.

అయితే జాన్వి కపూర్ కి కోలీవుడ్ లో కూడా ఒక సినీ ఆఫర్ వచ్చిందట. అయితే బోనీకపూర్ మాత్రం చాలామంది హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తున్నా ఆ ఇద్దరు హీరోలతోనే కోలీవుడ్లోకి ఫస్ట్ ఎంట్రీ ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా విజయ్ దళపతి లేదా అజిత్ సినిమాల ద్వారానే తన కూతురు ఎంట్రీ ఉండాలని బోనీకపూర్ ఆశపడుతున్నారట. అయితే సూపర్ స్టార్ ధనుష్ సరసన నటించే అవకాశం జాన్వీ కపూర్ కి వచ్చిందట. అయితే బోనీ కపూర్ మాత్రం ఆ హీరోతో అస్సలు నటించొద్దు అని తెగేసి చెప్పేశారట. సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ కోలీవుడ్లో ధనుష్ తో మాత్రం సినిమా చేయొద్దు అని గట్టిగా చెప్పేశారట.

boni kapoor strong warning to janvi-kapoor

boni kapoor strong warning to janvi-kapoor

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే బోనీకపూర్ ఎందుకు ధనుష్ పైన కోపంగా ఉన్నారు అని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే కేవలం శ్రీదేవి రజినీకాంత్ మధ్య ఉన్న అతి చనువే బోనీకపూర్ ధనుష్ తో సినిమాలు చేయకుండా ఆపేసిందా అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే జాన్వి కపూర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ దేవర ‘ సినిమాలో నటిస్తోంది. అంతకుముందే ఈ సినిమా నుంచి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp