Janhvi kapoor
Janhvi kapoor : జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్. డెబ్యూ సినిమా దడక్ తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ తండ్రి ప్రముఖ నిర్మాత బోనీకపూర్ అలాగే మరో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌ల సపోర్ట్‌తో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా Janhvi kapoor ఎంట్రీ ఈజీ అయినా కూడా నార్త్‌లో తన సొంత టాలెంట్‌తో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ఎదైనా బాలీవుడ్‌లో మొదలవుతుంటే ముందు జాన్వీ కపూర్ పేరే వినిపిస్తోంది. అంతగా తన పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది.
అయితే గత రెండేళ్ళుగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఇటు టాలీవుడ్ మీడియా అటు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అందుకు సమయం మాత్రం రావడం లేదు. ఇంతక ముందే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందని తారక్ ద్వారా జాన్వీ కపూర్ ఎంట్రీ ఉంటుందని మాటలు వినిపించాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాతో అనన్య పాండే ఎంట్రీ ఇస్తోంది.
Janhvi kapoor
అయితే ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో దిల్ రాజుతో కలిసి టాలీవుడ్‌లో మంచి హిట్ అందుకున్న బోనీకపూర్ నెక్స్ట్ స్టెప్ కూతురు జాన్వీ కపూర్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడట. అవసరమైతే తనే నిర్మాతగా టాలీవుడ్‌లో సినిమా ప్లాన్ చేసి దాని ద్వారా జాన్వీ కపూర్‌ను తీసుకు రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బోనీకపూర్ తలుచుకుంటే ఇది పెద్ద విషయమేమీ కాదు. సో గ్యారెంటీగా ఈ ఏడాది గానీ వచ్చే ఏడాది గానీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉండటం ఖాయమని అంటున్నారు.
Janhvi Kapoor
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.