Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ అయి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. శ్రీకాంత్ ప్రతి నాయకుడిగా, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబులతో దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండూ సూపర్ డూపర్ హిట్ అయి భారీ వసూళ్లను కట్ట బెట్టాయి. ఇప్పుడు అఖండ చిత్రం కలెక్షన్లను చూస్తుంటే వసూళ్లు ఆ చిత్రాలను మించి పోయేలా కనిపిస్తున్నాయి.అఖండ తొలి వారం ముగిసేసరికి అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటుంది. బాలయ్యకు తక్కువ మార్కెట్ ఉన్న నైజాంలో కూడా అఖండ సినిమా రు 9.5 కోట్లకు అమ్మారట. అయితే తొలి వారం ముగిసే సరికి అక్కడ ఈ చిత్రం… ఏకంగా 14.5 కోట్ల షేర్ కొల్లగొట్టి నిర్మాతలకు, బయ్యర్లకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా… అఖండ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే దానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ అంశం చక్కర్లు కొడుతోంది.టాలివుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లుగా పేర్కొనే కొంతమంది ఒక్కొ సినిమాకు కనీసం రు. 15 కోట్ల నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. త్రివిక్రమ్ లాంటి వాళ్లు ఏకంగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు.
రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయరామ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో బోయపాటితో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. దీంతో సినిమాకు 5 కోట్లు తీసుకునే బోయపాటి శ్రీనుకి ఈ మూవీకి అంత ఇవ్వలేమని నిర్మాతలు చెప్పారట. ఆ కారణంగా రెమ్యునరేషన్ తీసుకోని బోయపాటి… నిర్మాత నుంచి తన ఖర్చులను మాత్రమే తీసుకుని.. సినిమా హిట్ అయితే లాభాల్లో షేర్ తీసుకుంటానని నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే అనుకున్నట్టుగానే మూవీ భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడు బోయపాటికి రూ. 10 కోట్లకు పైగా ముట్టనుందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.