
Brahma Mudi Today Episode : బ్రహ్మముడి సీరియల్ 28 జులై 2023 లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఎపిసోడ్ 160 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కనకం తన కూతురు స్వప్ప దగ్గరికి వస్తుంది. తన కూతురు కడుపుతో ఉన్నందున తనకు చీర, సారె పెడుదామని అనుకుంటుంది కానీ.. తన ప్రవర్తన నచ్చక ఇంట్లో అందరి ముందు కనకం.. తన కూతురును తిడుతుంది. నీ పుట్టుకేంటో.. నీ స్థాయి ఏంటో.. అసలు నువ్వు చేసిన నీతి మాలిన పని ఏంటో అవన్నీ నీకు గుర్తుకు లేవా అంటుంది కనకం. అక్కడ ఆది దంపతుల్లా నిలబడిన వాళ్లు మామూలు వ్యక్తిలా కనబడుతున్నారా? అంటూ ప్రశ్నిస్తుంది కనకం. వాళ్ల ముందు నిలబడి నువ్వు చేసిన ఘనకార్యాన్ని సమర్థించుకుంటున్నావా? ఇంకొక మాట మాట్లాడినా నరికి పారేస్తాను ఏమనుకుంటున్నావో? నా కడుపున చెడ పుట్టావు కదే పాపిష్టిదానా అంటూ కనకం తన కూతురు మీద విరుచుకుపడుతుంది.
అమ్మ.. ఇది ఇలా మాట్లాడుతోందంటే.. దానికి కారణం నేను అంటుంది కనకం. నా పెంపకం వల్లే అది ఇలా తయారైంది అని అంటుంది కనకం. ముగ్గురు ఆడపిల్లలు పుడితే దీన్నే గారాబం చేశాను. ఏం కావాలన్నా ఇచ్చాను అందుకే ఇది ఇలా తయారైంది. ఈ కాఫీ కూడా నా కడుపునే పుట్టింది కానీ.. మమ్మల్ని ఇంత కాలం కడుపులో పెట్టుకొని చూసుకుంది. మా ఇంటి పరువు నిలబెట్టింది.. అంటుంది. నన్ను క్షమించండి అంటుంది కనకం. ఇంట్లో వాళ్లు తప్పు చేస్తే ఈ ఇల్లు మందలిస్తుంది కానీ.. ఒకరిని బయటికి పంపేలా ఎప్పుడూ ఈ ఇల్లు ప్రవర్తించదు అంటాడు పెద్దాయన. ఆ తర్వాత రా కనకం వెళ్లిపోదాం అంటాడు స్వప్ప నాన్న. కానీ.. అసలు ఏ పని మీద వచ్చారు అంటే.. కడుపుతో ఉన్న తన కూతురుకు చీర, సారె తెచ్చాం అంటుంది కనకం. దీంతో లేని కడుపు కోసం ఇంత ఆర్భాటం ఎందుకు అని మనసులో అనుకుంటుంది స్వప్న.
ఆ తర్వాత సర్వప్పకు ఒడి నింపుతుంది కనకం. మాటను ఎంత పొదుపుగా వాడితే అంత విలువ. మాట జారితే మనసులో నిలిచిపోతుంది. అది ఎప్పటికీ ఎవ్వరూ మరిచిపోరు. ఇదంతా నీ మీద ప్రేమతో చెప్పడం లేదు. నీ కుటుంబం మీద గౌరవంతో చెబుతున్నాను అని చెప్పి తన తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కనకం వచ్చిన విషయం నువ్వే ముందు తెలుసుకొని ఆపొచ్చు కదా అని స్వప్న భర్తతో అంటుంది అతడి తల్లి.
ఇంకో అవకాశం దొరికినప్పుడు తనను ఇంట్లో నుంచి బయటికి పంపిద్దువు అంటుంది. మళ్లీ అవకాశం వచ్చినప్పుడు పంపిద్దాం. అది కడుపుతో ఉన్నప్పుడే మనకు అవకాశం ఉంటుంది. బిడ్డ పుడితే అది కుదరదు. అందుకే బిడ్డ పుట్టే లోపే దాన్ని ఇంట్లో నుంచి తరిమేయాలి అని అంటుంది. ఇంటికి వెళ్లాక తన చిన్న కూతురుకే సపోర్ట్ ఇస్తాడు. నేను నీకు కొడుకు లెక్క. నా జిందగీ మొత్తం నిన్ను విడవను అంటుంది. తండ్రి సపోర్ట్ ఇవ్వడంతో తల్లి తిడుతుంది.
ఆ తర్వాత కావ్య కూడా స్వప్నతో మాట్లాడుతుంది. నిన్ను, నీ ప్రవర్తనను చూస్తుంటే నాకు భయమేస్తుంది అంటుంది కావ్య. దీంతో నీ బుద్దులు నేలమీద ఉంటాయి కానీ.. నా ఆశలు ఆకాశంలో ఉంటాయి అంటుంది స్వప్న. నువ్వు కడుపుతో ఉన్నావని అందరు అనుకుంటున్నారు. నువ్వు దుగ్గిరాల వారి ఇంట్లో ఒక సభ్యురాలివి అయ్యావు. సభ్యతతో ప్రవర్తించు. ఇక నుంచి అయినా మంచిగా ఉండు అంటుంది కావ్య. కానీ.. నన్ను ప్రపంచం ఇప్పుడే గుర్తించింది అంటుంది స్వప్న. దీంతో ముందు నీ కాపురాని నిలబెట్టుకో అంటుంది కావ్య. అసలు నీకు ఈ ఇంట్లో విలువ ఉందా? నా కాపురం గురించి మాట్లాడటానికి వచ్చావా అంటుంది స్వప్న. నీ మొగుడు నిన్ను ఎప్పుడు గెంటేస్తాడో నీకే తెలియదు అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.