Nuvvu Nenu Prema Today Episode : పద్మావతిని వదిలేసి అనును మాత్రమే ఇంటికి తీసుకెళ్లిన తన నాన్న.. ఈ విషయం తెలిసి పద్మావతి షాక్

Nuvvu Nenu Prema Today Episode : స్టార్ మాలో ప్రసారం అయ్యే నువ్వు నేను ప్రేమ సీరియల్ 28 జులై 2023 లేటెస్ట్ ఎపిసోడ్ 374 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచం మీద ఉన్న బట్టలను సర్దుతుండగా అప్పుడే వచ్చిన విక్రమాదిత్య.. ఏంటి అందరి ముందు నిన్ను నా భార్య అన్న మాటలు నిజం అనుకొని ఏవేవో ఊహించుకుంటున్నావా? నీకు అంత సీన్ లేదు. నేను చెప్పా కదా. అందరి ముందు మనం భార్యాభర్తల్లా నటించాలని. అందకే అనుమానం రాకుండా అందరి ముందు అలా చెప్పాను తప్ప.. నిజంగా నీ మీద ప్రేమతో కాదు. నువ్వు చేసిన పనికి నువ్వు ఎప్పుడూ నా భార్యవు కాలేవు.. అంటాడు విక్రమాదిత్య. దీంతో మీ మనస్తత్వం ఏంటో నాకు ముందు నుంచీ తెలుసు. మీరు ఏనాడూ నన్ను అర్థం చేసుకోలేదు అంటుంది పద్మావతి. మీకు మీ మాటే నెగ్గాలి. మీరు చెప్పినట్టే అందరూ వినాలి అంతే కదా అంటుంది పద్మావతి.

నేనెందుకు సర్దుకొని పోవాలి. పద్మావతి ఇక్కడ పడేదేలే అంటుంది. మీ గురించి తెలిసి నేను ఏనాడూ గొప్పగా ఊహించుకోలేదు. అన్నీ కోల్పోయి బాధలో ఉన్నా అంటుంది. ఇంతలో అనుకు తన నాన్న ఫోన్ చేస్తాడు. అమ్మ.. అను ఎట్టుండావు అని అడుగుతాడు. నీకో విషయం చెబుదామని ఫోన్ చేశా. పద్ధతి ప్రకారం పెళ్లి అయిన తర్వాత ఆడ పిల్లను పుట్టింటికి తీసుకురావాలి. దాని కోసమే నేను అక్కడికి వస్తున్నా. ఈ విషయం చెబుదామనే నేను ఫోన్ చేశా. రేపు బట్టలు సర్దుకొని రెడీగా ఉండు.. అని అంటాడు. దీంతో సరే అంటుంది. నాతో పాటు పద్మావతిని కూడా తీసుకుపోవడానికి వస్తున్నాడు కదా. తనకు కూడా ఒక మాట చెబుదాం అని అనుకుంటుంది అను. వెళ్లి పద్మావతి డోర్ కొడుతుంది. దీంతో విక్రమాదిత్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నాతో మాట్లాడటానికి వచ్చావా అక్క. నాకు తెలుసు అక్క. నువ్వు వస్తావని అంటుంది. రేపు ఇక్కడికి నాయిన వస్తున్నాడు. ఆ విషయం చెబుదామనే వచ్చాను అంటుంది అను.

Nuvvu Nenu Prema Today Episode : నాన్న వచ్చాడని ఎగిరి గంతేసిన పద్దు

దీంతో చాలా సంతోషిస్తుంది పద్మావతి. ఆ తర్వాత నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అను. రేపు నాయిన వస్తున్నాడు కదా ఆయన్నే క్షమించమని అడుగుతా అంటుంది. తెల్లవారుతుంది. అక్కడ అంటూ కిచెన్ లో పని చేస్తున్న అను దగ్గరికి వస్తుంది పద్మావతి. నాయిన ఫోన్ చేశాడా.. ఎప్పుడు వస్తున్నారంట. నాయిన ఒక్కడే వస్తున్నాడా అని అడుగుతుంది. నాయిన వస్తున్నాడు కదా.. నాయినకు అంతా చెప్పేస్తా అంటుంది పద్మావతి. నువ్వు కూడా అత్తలా నన్ను అనాథలా చూస్తున్నావా అంటే నోరు మూస్తుంది అను.

లేదు.. నువ్వు ఎప్పటికీ అనాథవు కావు. నీకు ఈ అక్క ఉంది అంటుంది అను. ఇంతలో అను నాన్న వస్తాడు. తన నాన్నను చూసి భావోద్వేగానికి గురవుతుంది అను. మా ఇంటి మహాలక్ష్మిని నీ చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉన్నాం అంటాడు. మెట్టింట్లో కూడా పుట్టింటి ప్రేమ పంచే భర్త దొరకడం నీ అదృష్టం అంటాడు. కానీ.. ఆర్యకు అంత మంచి భార్య దొరకడం ఆయన అదృష్టం అంటుంది అరవింద. మరోవైపు సిద్దూ.. పద్మావతి దగ్గరికి వెళ్తాడు. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంటాడు. మీ నాన్న వచ్చారు అని చెబుతాడు సిద్దూ. దీంతో పద్మావతికి పట్టరాని ఆనందం వేస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్లి అమ్మ ఎట్ట ఉంది. అత్త అని అడుగుతుంది. ఇంకా నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. నా కోసం నాయిన వచ్చాడు అని సంతోషపడుతుంది. వర్జ్యం రాకముందే మేము బయలుదేరుతాం అంటాడు. కానీ.. పద్మావతి తన బ్యాగ్ సర్దుకొని వచ్చేలోపే.. అనును తీసుకొని వెళ్తాడు. దీంతో పద్మావతికి చాలా బాధేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

11 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

11 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

13 hours ago