Brahma Mudi 29 July Today Episode : బ్రహ్మముడి సీరియల్ 29 జులై 2023 శనివారం లేటెస్ట్ ఎపిసోడ్ 161 తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పు, తన బ్రో ఇద్దరూ కలిసి జాగింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి చూసి మీ అక్క ఆ యాడ్ లో నటించింది కదా అంటూ హేళన చేస్తాడు. బ్రో కూడా మీ అక్క ఆ యాడ్ లో నటించకుండా ఉండాల్సింది అంటాడు. మరోవైపు దుగ్గిరాల నిలయంలో యాడ్ గురించే అందరూ చర్చించుకుంటూ ఉంటారు. స్వప్న అలాంటి యాడ్ లో నటించడం ఏంటి అని అనుకుంటారు. దీంతో రాజ్ వచ్చి ఆ యాడ్ బయటికి రాదు. రూ.30 లక్షలు ఇచ్చి ఆ యాడ్ టెలికాస్ట్ కాకుండా చేశాను అంటాడు రాజ్. దీంతో అవన్నీ విని స్వప్నకు కోపం వస్తుంది. రాజ్ అసలు నువ్వు ఎందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు. నా యాడ్ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు అని అడుగుతుంది.
దీంతో కావ్య మధ్యలోకి వచ్చి స్వప్నను తిడుతుంది. నువ్వు అన్నీ మరిచిపోయి వెళ్లి పది మంది పది రకాలుగా మాట్లాడుకునేలా చేసి ఇంత చేస్తే.. నా భర్త ఆ పనిని సరిచేశాడు. నీ పరువును నిలబెట్టాడు. అందుకోసం లక్షలు ఖర్చు పెట్టాడు. అలాంటి మనిషిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావా.. నాలుక కోసేస్తా జాగ్రత్త అంటుంది కావ్య. నా భర్తకు విలువ ఇవ్వని ఆడదానికి నేను సరైన బుద్ధి చెబుతా. నువ్వు అక్కవైనా.. కుక్క అయినా నా దృష్టిలో రెండూ ఒకటే. ఎటువంటి ఇంటికి కోడలిగా వచ్చావో తెలుసా? ఎటువంటి వాళ్ల మధ్యలో ఉంటున్నావో తెలుసా? అటువంటి వాళ్లతో ఎలా నడుచుకోవాలో తెలుసుకొని ప్రవర్తించు అంటూ వార్నింగ్ ఇస్తుంది కావ్య. నా భర్తకు సారీ చెప్పు అంటుంది కావ్య.
నువ్వు సారీ చెప్పకపోతే ఇక్కడి నుంచి అడుగు కూడా కదల్లేవు అంటుంది కావ్య. దీంతో సారీ రాజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. ఈ అమ్మాయికి కోపం కూడా వస్తుందా అని అందరూ షాక్ అవుతారు. కోపంతో తన బెడ్ రూమ్ లోకి వెళ్లిన స్వప్న పిచ్చిపిచ్చిగా చేస్తుంది. తన బెడ్ రూమ్ లో గట్టిగా అరుస్తుంది. అవన్నీ రాహుల్, తన తల్లి గమనిస్తూ ఉంటారు. ఇదంతా మన మంచికే. ఈ తింగరిది రాజ్, కావ్య మీద కోపంతో రగిలిపోతోంది. ఇదే రైట్ టైమ్. వాళ్లిద్దరి మీద మరింత ద్వేషాన్ని పెంచు. స్వప్న మీద ఆవేశమే కానీ.. ఆలోచన ఉండొద్దు.. అని రాజ్ కు చెబుతుంది తన తల్లి.
దీంతో బెడ్ రూమ్ లోకి వెళ్తాడు రాహుల్. ఐయామ్ సారీ స్వప్న అంటాడు. ఆ రాజ్ ఇలా చేస్తాడని నేను ఊహించలేదు అంటాడు. నువ్వేం చేస్తావులే రాహుల్ అంటుంది. దీంతో ఉండు నీకోసం కాఫీ తీసుకొస్తాను అంటుంది స్వప్న. వద్దు అన్నా కూడా వినదు స్వప్న. ఈ తింగరి దానికి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు అని అనుకుంటాడు రాజ్.
మరోవైపు రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. మీదో ఒక మాట చెప్పలి అంటుంది కావ్య. రెండు అక్షరాలే అంటుంది. థాంక్స్ అంటుంది. ఆ యాడ్ బాన్ చేయించినందుకు థాంక్స్ అంటుంది. అది కంటిన్యూ అయితే తన జీవితం ఎలా ఉండేదో అంటుంది. నా ఫ్యామిలీ పరువు పోకుండా ఉండేందుకే ఈ పని చేశా అంటాడు రాజ్.
మరోవైపు రాహుల్.. స్వప్నతో మాట్లాడుతాడు. కావ్య గురించి చెడుగా చెబుతాడు. నీకు అడ్డుగోడగా కావ్య ఉంది అంటాడు. నేనేం సాధించకూడదు. గుర్తింపు తెచ్చుకోకూడదు. అదే కదా తనకు కావాల్సింది. నేను ఎంతో ఇష్టపడి కలలు కని ఒక యాడ్ చేస్తే ఎక్కడ నేను సెలబ్రిటీ అవుతానని కుళ్లుతో ఈ పని చేసింది.. అంటుంది స్వప్న. దీంతో కావ్యకు ఎదురు తిరగడం నా వల్ల, మా అమ్మ వల్లే కాలేదు. నీ వల్ల ఏం అవుతుంది. వదిలేయ్ అంటాడు రాహుల్. కానీ.. నేను ఏంటో చూపించి తీరుతా.. ఇది నా చాలెంజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.
మరోవైపు కృష్ణమూర్తి ఇంటికి చంపక్ లాల్ వస్తాడు. బస్తీ పెద్దలను తీసుకొని వస్తాడు. జరిగిందంతా తెలిసింది. ఈయన మీకు 10 లక్షల అప్పు ఇచ్చారు. ఆ అప్పు కింద ఇల్లు రాయించుకున్నారు. అప్పు కాదు.. వడ్డీ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. అంతే కదా అంటాడు పెద్దమనిషి. నా 10 లక్షలు, వడ్డీ రూ.50 వేలు అంతా కలిపి ఒకేసారి కట్టమనండి అంటాడు చంపక్ లాల్.
దీంతో నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు కృష్ణమూర్తి. కనకం మధ్యలో మాట్లాడి.. 10 లక్షలకు ఇల్లు స్వాధీనం చేసుకుంటా అంటున్నాడు. ఒకేసారి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటుంది కనకం. అలా కాదు కానీ.. ఆరు నెలల గడువు పెడదాం అంటారు. లేదంటే ఇల్లు అమ్మేయండి అంటాడు చంపక్ లాల్. దీంతో చచ్చినా అమ్మను అంటుంది. రెండు రోజుల్లో రూ.50 వేల వడ్డీ కట్టాలని లేకపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి నన్ను కిడ్నాప్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తా అని బెదిరిస్తాడు సేటు. ఈ విషయం కావ్యకు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Health Tips : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే సోంపు తిన డం మంచిదని అందరికీ తెలుసు. ఇందులో…
Health Tips : పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనడం నిజమే. కానీ కొన్ని పండ్లను కలిపి తినడం శరీరానికి హానికరంగా…
Vastu Tips | గణేష్ చతుర్థి రోజు సమీపిస్తుండటంతో హిందూ భక్తుల్లో పండుగ ఉత్సాహం నెలకొంది. 2025 ఆగస్టు 27న ఈ…
New Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Kukatpally Girl Murder Mystery : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి బాలిక హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం…
Central New Bill : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతిని అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లులకు బలమైన మద్దతు…
AP Liquor Scam Case Update : ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాం దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో మాజీ…
Seethamma vakitlo sirimalle chettu| తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె…
This website uses cookies.