Nuvvu Nenu Prema 29 July Today Episode : గుండెలు పగిలేలా రోదించిన పద్మావతి.. విక్కీ, పద్దు అసలు భార్యాభర్తలు కాదని అరవిందకు తెలుస్తుందా?

Nuvvu Nenu Prema 29 July Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ 29 జులై 2023, శనివారం ఎపిసోడ్ రిలీజ్ అయింది. లేటెస్ట్ ఎపిసోడ్ 375 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేశా. నువ్వు కానీ.. అమ్మ కానీ ఎత్తలేదు. నాకు తెలుసు నాన్న. నీకు నా మీద కోపం వెన్నపూస లాంటిది. ఇట్టే కరిగిపోతది అంటుంది. అందరినీ పిలిచి చూస్తున్నారా.. నా కోసం మా నాన్న వచ్చారు అంటుంది పద్మావతి. ఇంతలో వర్జ్యం రాకముందే మేము బయలుదేరాలి.. మీరు అనుమతి ఇస్తే అని అడుగుతాడు. వెంటనే వెళ్లి బట్టలు సర్దుకొని రా వెళ్దాం అని అనుతో అంటాడు. కానీ.. పద్మావతి మాత్రం తనను అంటున్నాడేమో అని అనుకుంటుంది. వెంటనే అను కూడా లోపలికి వెళ్తుంది. తన రూమ్ లోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక ఎప్పుడు పడితే అప్పుడు నేను అమ్మానాన్నను చూడొచ్చు అని అనుకుంటుంది.

ఇంతలో అను బట్టలు సర్దుకొని కిందికి వస్తుంది. ఇంతలో విక్రమాదిత్య కిందికి వస్తాడు. నమస్తే అంకుల్ అని భక్తతో అంటాడు కానీ.. పట్టించుకోడు. వర్జ్యం వస్తుంది.. వెళ్తాం అంటాడు. పద్మావతి రాకముందే ఎలా తీసుకెళ్తారు అని అడుగుతుంది అరవింద. దీంతో నేను నా కూతురు అనును మాత్రమే తీసుకెళ్లడానికి వచ్చాను.. తననే తీసుకెళ్తున్నాను అంటాడు భక్త. దీంతో కొత్తగా అలా అంటున్నారు ఏంటి.. పద్మావతి కూడా మీ కూతురే కదా అంటే.. నా కూతురు కాదు అంటాడు భక్త. తండ్రిగా నా ప్రాణం కంటే ఎక్కువ చేశాను కానీ.. నేను ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే పరువును తీసి అందరి ముందు తలవంచుకునేలా చేసింది. తను ఎలా నా కూతురు అవుతుంది. తను ఎప్పటికీ నా కూతురు కాదు అంటాడు భక్త. అను మాత్రమే నా కూతురు అంటాడు భక్త. మాకోసం మా సంతోషం కోసం పెళ్లిని కూడా వద్దు అనుకుంది అంటాడు. అలా కాకుండా తను మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చి మమ్మల్ని అవమానించింది. తను ఎలా మా కూతురు అవుతుంది. ముమ్మాటికీ కాదు అంటాడు భక్త.

Nuvvu Nenu Prema 29 July Today Episode : పద్మావతిని వదిలేసి అనును మాత్రమే తీసుకెళ్లిన భక్త

తను చేసిన పనికి మేము నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాం. తను చేసిన పనికి మేము గుండె పగిలి ఎప్పుడో చావాల్సి ఉంది. బహుషా ఈ కూతురు ప్రేమే మమ్మల్ని బతికిస్తా ఉంది అంటాడు. చెల్లిని కూడా తీసుకుపోదాం అంటుంది అను. కానీ.. నాకు నువ్వు ఒక్కదానివే కూతురువి. నీకు చెప్పుకోవడానికి చెల్లెలు ఎవరూ లేరు అంటాడు భక్త. నన్ను బాధపెట్టాలని చూడకండి అని అందరినీ వేడుకుంటాడు భక్త. పాపం నాయన.. పద్మావతిని కూడా తీసుకెళ్దాం అంటే.. తన చేతులు పట్టుకొని తీసుకెళ్లిపోతాడు భక్త.

ఇంతలో పద్మావతి బట్టలు సర్దుకొని నాయినా నేడు రెడీ అంటూ కిందికి వస్తుంది. కానీ.. భక్త కనిపించడు. అరవింద గారు మా నాయిన ఏడి అని అడుగుతుంది. దీంతో ఆమె ఏం మాట్లాడదు. ఫోన్ వస్తే మాట్లాడటానికి వెళ్లారా? అని అనుకుంటుంది. నాయినా త్వరగా రా టైమ్ అవుతోంది అంటుంది. అక్కా నువ్వు అయినా ఎంత సేపు చేస్తున్నావు. బిన్నరా.. లేదంటే నిన్ను విడిచిపెట్టి నాయినను తీసుకొని వెళ్తా అంటుంది పద్మావతి. బావ గారు అక్కను త్వరగా రమ్మని చెప్పండి అని అడుగుతుంది పద్మావతి. దీంతో మీ అక్కను ఇందాకే తీసుకెళ్లిపోయారు పద్మావతి అంటాడు. దీంతో ఏంది బావ గారు పెళ్లిలో మిమ్మల్ని ఆటపట్టించానని.. మీరు ఇప్పుడు నన్ను ఆటపట్టిస్తున్నారు కదా. మా నాయిన వచ్చిందే నన్ను తీసుకెళ్లడానికి.. మరి నన్ను ఎట్లా వదిలేసి వెళ్తారు అంటుంది పద్మావతి.

దీంతో లేదు పద్మావతి.. నిజంగానే అనును తీసుకొని మీ నాన్నగారు వెళ్లిపోయారు అని అరవింద చెబుతుంది. దీంతో షాక్ అవుతుంది పద్మావతి. మీరు నిజం చెబుతున్నారా అంటే.. అవును అని అందరూ అంటారు. మా నాయన నన్ను విడిచిపెట్టి పోడు అంటూ బయటికి పరిగెత్తుతుంది పద్మావతి. అప్పుడే బయటికి వెళ్లి ఆటో ఎక్కుతూ కనిపిస్తారు అను, భక్త. నాయినా ఆగు నాయినా అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆటో కదులుతుంది. నాయినా ఆగండి అని ఆటో వెంట పరిగెత్తుతూ ఉంటుంది.

కానీ.. ఆటో ఆగదు. దీంతో అక్కడే కుప్పకూలిపోతుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు. నాన్నతో  తన పాత మెమోరీస్ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది పద్మావతి. విక్కీ నువ్వు వెళ్లి ఒకసారి చూడు అంటుంది అరవింద. ఇంతలో ఇంట్లోకి వస్తుంది పద్మావతి. ఏమైంది అని అడుగుతుంది అరవింద. నన్ను ప్రాణంగా ప్రేమించే మా నాన్నే నేనంటే ఇష్టం లేనట్టుగా పోయాడు. ఇంకా నాకు ఎవ్వరూ లేరు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది పద్మావతి. నేను మళ్లీ అనాథను అయ్యాను అని అంటుంది.

బ్యాగు తీసుకొని తన రూమ్ లోకి వెళ్లిపోతుంది పద్మావతి. అను వస్తుందని ఇంట్లో హడావుడి వాతావరణం ఉంటుంది. లక్ష్మీ ఇంకా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆటో వస్తుంది. ఆటోలో నుంచి భక్త, అను దిగుతారు. పిన్ని, అత్త బాగుండారా అంటుంది. అమ్మ ఏది అంటే మొక్కు తీర్చుకోవడానికి ఊరికి పోయింది అంటారు. పద్మావతి రాలేదా అని అడుగుతుంది లక్ష్మీ.

అను ఒక్కతే నాకూతురు. మీ అక్క ఊరెళ్లింది కాబట్టి తను చేయాల్సిన పనులు నువ్వు చేయడానికి వచ్చావు. అనును చూసుకొని తనకు కావాల్సినవి ఏర్పాటు చేయి అని అంటాడు భక్త. నాకు అను ఒక్కతే కూతురు. ఇంకెవరూ లేరు. అర్థమయిందా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

51 minutes ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

2 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

11 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

12 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

13 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

15 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

16 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

17 hours ago