Brahmamudi 3 Aug Thursday Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 ఆగస్టు 2023, గురువారం ఎపిసోడ్ 165 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ కు వచ్చిన లెటర్ ను చదువుతా అని అందరి ముందు హడావుడి చేస్తుంది కావ్య. కానీ.. కళ్యాణ్ మాత్రం వద్దు అస్సలు చదువొద్దు అని కావ్యను వేడుకుంటాడు. అయినా కూడా కావ్య వినదు. చదవాల్సిందే అంటుంది. ఇంట్లో వాళ్లు అందరినీ అడుగుతుంది. ఆ కవిత చదవాలా వద్దా అని. దీంతో అందరు కూడా చదవాలి అంటారు. కానీ.. చివరకు ఆ లెటర్ ను లాక్కుంటాడు కళ్యాణ్. తనకు వచ్చిన పూల కుండిని కూడా తీసుకొని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లి ఆ లెటర్ ను ఓపెన్ చేస్తాడు. నీ కవిత బాగుందని రాస్తుంది అందులో. బాగా కుదిరింది. నీ కవిత చదివాక చిరాకు అంతా పరార్ అయింది. నిన్ను వదలను ఇక. నీడలా వెంటాడుతూనే ఉంటా. ఫోటోలో ముద్దొస్తున్నావు. ఇక ఉంటాను. అనుక్షణం నీ వెంటే ఉంటా అని రాస్తుంది కవిత.
ఇన్నాళ్లకు దొరికాను అని రాసింది అంటే.. నేను ఈ అమ్మాయికి ముందే తెలుసా? ఎవరై ఉంటారు అని ఆలోచిస్తాడు కళ్యాణ్. నా పేరు కావాలా.. నీ ఆరచేతిలోనే నా పేరు మొదటి అక్షరం రాసి ఉంది అని క్లూ ఇస్తుంది. దీంతో ఏంటి తన పేరు అని తెగ తంటాలు పడుతుంటాడు. మరోవైపు చిట్టీల రంగమ్మ దగ్గరికి వస్తారు కనకం, అప్పు. ఇద్దరు కూతుళ్లు గొప్పింట్లోళ్ల కోడళ్లు అయ్యారు కదా. అయినా నాతో ఏం అవసరం వచ్చింది అని అడుగుతుంది. చిట్టీ వేస్తున్నావట కదా అని అడుగుతుంది. దీంతో ఈనెల 50 వేల చిట్టీ ప్రారంభం అవుతోంది కదా అది వేస్తా అని అడుగుతుంది. దీంతో అవును 10 నెలల చిట్టీ అని చెబుతుంది రంగమ్మ. కానీ.. నేను మొదటి నెల ఎత్తుకుంటా అని కనకం అడిగితే నిన్ను ఎవడు నమ్ముతాడు అని కనకంపై సీరియస్ అవుతుంది రంగమ్మ. ఇంతలో తన మొగుడు బయటికి వచ్చి ఏంటి లొల్లి అని అడుగుతాడు. దీంతో ఈయన ఎవరు అని అడుగుతుంది అప్పు. నా మొగుడు అంటుంది. మరి మొన్న సినిమాకు వెళ్లావు కదా.. ఆయన ఎవరు అని వాళ్ల కాపురంలో చిచ్చు పెట్టి వస్తుంది అప్పు.
కట్ చేస్తే స్వప్నకు మెన్షస్ స్టార్ట్ అవుతాయి. తనకు కడుపునొప్పి విపరీతంగా వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియదు. వెంటనే కడుపునొప్పి తగ్గే ట్యాబ్లెట్స్ ఆర్డర్ చేస్తుంది. అవి తీసుకొని వెళ్తుండగా రుద్రాణి చూస్తుంది. అసలు ఏంటి ఆ ట్యాబ్లెట్స్ అని అనుకుంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటుంది. మరోవైపు డబ్బులు తీసుకొని బ్యాగులో పెట్టుకొని తన నాన్నకు ఫోన్ చేసి చెబుదామా అని అనుకుంటుంది. కానీ.. వద్దులే అనుకుంటుంది. కానీ.. రాజ్ కు మెసేజ్ పెడుతుంది. మీరు సరైన సమయానికి డబ్బులు ఇచ్చారు. థాంక్స్ అని అంటుంది. నేను ఈ డబ్బులు మా నాన్నకు ఇవ్వాలనుకున్నాను అని మెసేజ్ పెడుతుంది. అవి నీ డబ్బులు నీ ఇష్టం. అవి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. థాంక్స్ వద్దు నాకు. నువ్వు చేసిన పనికి ఇచ్చిన రెమ్యునరేషన్ అది అని తిరిగి మెసేజ్ పెడతాడు రాజ్.
మరోవైపు స్వప్న మీద డౌట్ వస్తుంది రుద్రాణికి. తను బయటికెళ్లడం చూసి.. తన రూమ్ లోకి వెళ్తుంది. ఇందాక కవర్ నాముందే తీసుకొచ్చిందే. ఎక్కడ పెట్టి ఉంటుంది అని అనుకుంటుంది. అక్కడ వార్డ్ రోబ్ లో పెట్టిన కవర్ ను చూసి అందులో ఉన్న ట్యాబ్లెట్స్ ను చూస్తుంది. ఇది తెచ్చుకుంది ఏంటి సీక్రెట్ గా. అంటే.. దీనికి ప్రెగ్నెన్సీ లేదా అని అనుకుంటుంది. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని బయటికి వస్తుంది. ఇంతలో రాహుల్ వస్తాడు. నీ పెళ్లాం ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు వాడుతోంది అని రాహుల్ ను అడుగుతుంది. అంటే స్వప్నకు కడుపు రాలేదా అని అడుగుతాడు రాహుల్. దాన్నే ఇప్పుడు మనం తెలుసుకోవాలి అని అంటుంది.
ఇంతలో స్వప్న వస్తుంది. ఆ ట్యాబ్లెట్స్ ను లాక్కుంటుంది. అసలు నీకు కడుపు రాలేదా అని అడుగుతాడు రాహుల్. దీంతో ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటుంది స్వప్న. ఇన్నాళ్లు మమ్మల్ని మోసం చేశావా? పెళ్లి చేసుకోవడం కోసమే మోసం చేశావా? లేక మా వాడి మీద పగ తీర్చుకోవడం కోసమే మోసం చేశావా? ఇది నీ ప్లానా.. లేక నీ చెల్లెలి ప్లానా.. లేక నీ అమ్మ కనకం ప్లానా అని నిలదీస్తుంది రుద్రాణి. ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. ఏమైంది అక్క అని అడుగుతుంది. దీంతో గొడవ అయింది అని అంటుంది స్వప్ప. ఎవరి వల్ల అంటే నీ వల్ల అంటుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది.
నేనేం చేశాను అంటే.. తన చేతుల్లో ఆ ట్యాబ్లెట్స్ ను పెడుతుంది. కడుపు నొప్పిగా ఉంది. ట్యాబ్లెట్స్ కావాలి. ఆర్డర్ పెట్టు అన్నావు కదా. అవి నాకోసం అనుకొని నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు అంటుంది. కానీ.. తనను రూమ్ లోకి తీసుకెళ్లి నువ్వు కడుపు లేదని చెప్పాలి అంటుంది కావ్య. మరోవైపు నువ్వు మీ ఇంటికి వెళ్లి ఇంతకుముందు, ఇప్పుడు డబ్బు ఇచ్చావా లేదా అని ప్రశ్నిస్తుంది రాజ్ తల్లి. దీంతో ఇచ్చాను అంటుంది కావ్య. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.