Nuvvu Nenu Prema 3 Aug Thursday Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 ఆగస్టు 2023 గురువారం ఎపిసోడ్ 379 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్లిన పద్మావతి ఇక నేను బతకను. నావల్ల కాదు. ఎవరి కోసం బతకాలి తల్లి. గుండెపగిలి నా బాధను రోజూ తట్టుకొని చస్తూ బతికే కంటే ఒకేసారి చావడం నయం అని అంటుంది పద్మావతి. అన్ని సమస్యలకు నా చావే పరిష్కారం. నేను చావాలి. నేను చస్తేనే అందరికీ మంచిది అని అనుకొని బ్యాగు తీసుకొని ఆవేశంతో ఓ కొండ ఎక్కుతుంది పద్మావతి. మరోవైపు విక్రమాదిత్య పద్మావతి ఫోటో చూపించి అందరినీ అడుగుతుంటాడు. కానీ.. ఎవ్వరూ తమకు తెలియదు అంటారు.
కోపంతో కొండ మీదికి ఎక్కుతుంది పద్మావతి. నిన్ను ఎక్కడ అని వెతకాలి. ఎక్కడున్నావు పద్మావతి అని కారులో వెళ్తుంటాడు. ఒకచోట కారు ఆపి.. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు. దీంతో చూశాను. ఆ కొండ వైపు వెళ్తూ ఉంది. పాపం ఏడుస్తూ వెళ్తోంది అని ఓ వ్యక్తి చెప్పడంతో నో.. అలా జరగడానికి వీలు లేదు. పద్మావతి అంటూ తనను వెతుక్కుంటూ వెళ్తాడు విక్రమాదిత్య. మరోవైపు ఆవేశంతో కొండ ఎక్కుతూ ఉంటుంది పద్మావతి. చివరకు ఓ కొండ మీదికి ఎక్కి తన పాత మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది పద్మావతి. తనను అందరూ అవమానించడం గుర్తు చేసుకుంటుంది. చివరకు తన తండ్రి కూడా తనను అవమానించడంపై బాధపడుతుంది పద్మావతి. అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. నేను చేయని తప్పుకు మిమ్మల్ని బాధపెడుతున్నాను. ప్రస్తుతం నేను జరిగింది చెప్పే పరిస్థితుల్లో లేను. అక్క పెళ్లి ఆగకూడదని నేను ఇదంతా చేశా. దానికి శిక్షగా నేను చావాలనుకుంటున్నా. మరో జన్మమంటూ ఉంటే మళ్లీ అనాథలా కాకుండా మీ కన్నబిడ్డలా పుట్టాలని కోరుకుంటున్నా అని ఆ దేవుడిని వేడుకొని దూకబోతుంది పద్మావతి.
మరోవైపు పద్మావతి కోసం అక్కడా ఇక్కడా అంతా వెతుకుతాడు కానీ.. ఎక్కడా కనిపించదు. కానీ.. ఒక చోట కూర్చొని మిరపకాయ బజ్జీలు తింటూ ఉంటుంది పద్మావతి. బాధపడి చచ్చేదేలే.. బతికి నేనేంటో చూపిస్తా అని అనుకుంటుంది పద్మావతి. అక్క పెళ్లి ఆగకుండా ఉండటం కోసం పెళ్లి చేసుకున్నా కానీ.. అందరినీ బాధపెట్టాలని కాదు కదా. తప్పు చేసినోడు హాయిగా ఉంటే నేను దూకి చావాలా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్న బాధలు వచ్చినా భయపడేదేలే.. ఆ టెంపరోన్ని ఉతుకుతా. శ్రీనివాసా క్షమించు అప్ప. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నాకు నువ్వే తోడు ఉండు అప్ప అంటూ బజ్జీలు తిన మంచినీళ్లు తాగుతుంది.
మరోవైపు పద్మావతి అంటూ కొండలు, గుట్టలు అన్నీ వెతుకుతూ ఉంటాడు విక్కీ. కానీ.. తను ఎక్కడా కనిపించదు. ఇంతలో ఓ వ్యక్తి వెళ్తుంటే ఈ అమ్మాయిని చూశారా అంటే అటు టెంపుల్ వైపు వెళ్లింది అని చెబుతాడు. దీంతో కారులో అటువైపు బయలుదేరుతాడు విక్కీ. ఇంతలో అను భర్త వస్తాడు. లక్ష్మీ పలకరిస్తుంది. పద్మావతి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. లేదండి అంటుంది.
ఇంతలో భక్త వస్తాడు. పద్మావతి గురించి మళ్లీ టాపిక్ వస్తుంది. తనకు, మాకు ఎలాంటి సంబంధం లేదు అంటారు. ఏ కారణంతో ఆ పని చేసిందో చెప్పమని అంటున్నం కదా. తను చెప్పకపోతే నలుగురిలో తల ఎత్తుకొని ఎలా బతకలం అంటాడు భక్త. దీంతో అలా అని పద్మావతిని వదిలేస్తారా అంటాడు అను భర్త. మరోవైపు గుడి దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది పద్మావతి. తనను వెతుక్కుంటూ వచ్చిన విక్కీని చూసి షాక్ అవుతుంది. తల్లీ నీదే భారం అని చెప్పి అతడి నుంచి తప్పించుకొని వెళ్తుంది పద్మావతి. ఇంతలో తనను పట్టుకుంటాడు విక్కీ. ప్రసాదం కూడా తిననివ్వడు. ఏంటమ్మా సాయం చేస్తావనుకుంటే ఇట్టా ఇరికించావు అని అనుకుంటుంది. ఏం చేయాలో తెలియదు పద్మావతికి. నన్ను టెన్షన్ పెడుతూ నువ్వు ప్రశాంతంగా ప్రసారం తింటున్నావా అంటాడు విక్కీ. నీకు కావాల్సినంత ప్రసాదం పెడతా పదా అంటాడు. దీంతో ఎక్కడికి అంటే.. ఇంటికి అంటాడు. దీంతో నేను రాను అంటుంది పద్మావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.