Brahmamudi 14 Sep Thursday Full Episode : కావ్యను కొట్టబోయిన అపర్ణ.. అడ్డుకున్న రాజ్.. భార్య కోసం తల్లిని ఎదిరించిన రాజ్.. అపర్ణ షాక్

Advertisement

Brahmamudi 14 Sep Thursday Full Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 14 సెప్టెంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 201 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కావ్య కోసం రాజ్ గదిలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య వస్తుంది. తనను చూసి నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంటి అంటే థాంక్స్ అని అంటాడు రాజ్. దీంతో కావ్య షాక్ అవుతుంది. అసలు రాజ్ థాంక్స్ చెప్పడం ఏంటని షాక్ అవుతుంది. అయితే.. నాకు థాంక్స్ కాదు కావాల్సింది సారీ అని అడుగుతుంది కావ్య. కానీ.. నేను సారీ చెప్పను అంటాడు రాజ్. అసలు మీరు ఎందుకు ఇంతా కోపంగా ఉంటారు. మూడు నెలల సమయం అడిగారు కానీ.. మీరు మారుతారని నాకు మాత్రం అనిపించడం లేదు అంటుంది కావ్య.

Advertisement
brahmamudi 14 september 2023 thursday full episode
shantha

అసలు మీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కావడం లేదు అంటుంది కావ్య. దీంతో వామ్మో కావ్య ఆవలిస్తే పేగులు లెక్కబెడుతుంది కాబోలు అని అనుకుంటాడు రాజ్. ఆ తర్వాత తాతయ్య దగ్గరికి వెళ్లిన కావ్య.. రాజ్ గురించి చెబుతుంది. ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉంది. అసలు ఆయన మారేందుకు మూడు నెలల సమయం ఇచ్చారు కానీ.. నాకు అయితే నమ్మకం లేదు అన్నట్టుగా తాతయ్యతో చెబుతుంది. దీంతో తాతయ్యకు కోపం వస్తుంది. అంటే నేను చచ్చాక నిన్ను వదిలేస్తాడా అంటూ సీరియస్ అవుతాడు. అరుస్తాడు. ఇంతలో రాజ్ వచ్చి అక్కడ కావ్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. తాతయ్య ఏదో అన్నారు అంటే.. ఏం లేదు నిద్రలో ఉలిక్కిపడ్డారు అంటూ కవర్ చేస్తాడు. ఇంతలో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. చూస్తే అది కల. ఇక.. టీవీ ఆన్ చేసి యోగాసనాలు చూస్తూ ఉంటాడు. వాటిని చూస్తూ వేస్తూ అలాగే మధ్యలోనే ఉండిపోతాడు రాజ్.

Advertisement

Brahmamudi 14 Sep Thursday Full Episode : శాంతాకు డబ్బులు ఇవ్వబోయిన కావ్య

ఇంతలో కావ్య వస్తుంది. రాజ్ ఆ యోగాసనం మధ్యలో గింజుకుంటూ ఉంటాడు. మీరు నాకు సారీ చెబితేనే నేను మీకు హెల్ప్ చేస్తా అని కరాకండిగా చెప్పేస్తుంది కావ్య. దీంతో సరే అని సారీ చెబుతాడు. అప్పుడు తన యోగాసనం నుంచి అతడిని విడిపిస్తుంది కావ్య. ఇదంతా భార్యను ఎదురించే శక్తి కోసం చేసే యోగాసనం అని టీవీలో చెబుతుంటే కావ్యకు కోపం వస్తుంది. ఇంతలో రుద్రాణి కాఫీ అడిగినా ఇవ్వదు కావ్య. దీంతో భర్తను తిప్పుకునేందుకు మందు పెట్టావు అంటూ ఏదేదో వాగుతుంది రుద్రాణి. ఆ మాటలకు రుద్రాణికి బాగానే సమాధానం చెబుతుంది కావ్య.

శాంతా డబ్బులు కావాలని అపర్ణను అడుగుతుంది. అయితే.. అపర్ణ మాత్రం తన దగ్గర డబ్బులు లేవని, ఇవ్వనని.. మనిషికి మించిన అవసరాలు ఉండకూడదు. అదే తప్పు. దానికోసం అప్పు చేయడం ఇంకా తప్పు అని శాంతాను తిడుతుంది అపర్ణ. ఇవ్వడం కుదరదు వెళ్లు ఇక్కడ నుంచి అని అంటుంది అపర్ణ. ఇదంతా రుద్రాణి చూస్తుంది. ఎలాగైనా ఈ విషయంలో కావ్యను ఇరికించాలని చూస్తుంది. వెంటనే శాంతను పిలిచి నీకు డబ్బు అవసరం ఉంది కదా అని అడుగుతుంది. దీంతో అవును అమ్మ. చాలా అవసరం ఉంది అని చెబుతుంది శాంత. దీంతో వెళ్లి కావ్యను అడుగు నీ పని అయిపోతుంది అని చెబుతుంది రుద్రాణి.

కళ్యాణ్ కు కాఫీ ఇచ్చిన కావ్య.. అనామిక గురించి చెబుతుంది. నిజమే తను అనామికను ప్రేమిస్తున్న విషయం తనకు చెప్పాలని అనుకుంటాడు. అప్పు హెల్ప్ తీసుకోవడం కోసం ఫోన్ చేస్తాడు. ఒకసారి కలవాలని అడుగుతాడు. అనామికను ప్రేమిస్తున్న విషయం తనకు చెప్పాలని అనుకుంటాడు కళ్యాణ్.

శాంత కావ్య దగ్గరికి వెళ్లి అమ్మ.. ఒక 15 వేలు కావాలి అని అడుగుతుంది కావ్యను. దీంతో సరే.. తెస్తా ఉండు అని చెప్పి లోపలికి వెళ్లి 15 వేలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇదే అదునుగా భావించిన రుద్రాణి.. వెళ్లి నువ్వు డబ్బు ఇవ్వనన్నావు కదా. కానీ.. కావ్య మాత్రం ఆ శాంతకు డబ్బులు ఇస్తోంది అని అపర్ణకు చెబుతుంది. దీంతో అపర్ణకు చాలా కోపం వస్తుంది. డబ్బులు ఇవ్వబోతున్న కావ్యను ఆపి ఆగు అంటుంది. కావ్య మీద సీరియస్ అవుతుంది అపర్ణ. రాజ్ మంచితనంతో నీ కుటుంబానికి, పని మనిషికి కూడా దోచిపెడుతున్నావా అంటూ సీరియస్ అవుతుంది. తనపై చేయి లేపుతుంది అపర్ణ. వెంటనే రాజ్ వచ్చి తల్లి చేయి పట్టుకొని అడ్డుకుంటాడు. దీంతో అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
Advertisement