Brahmamudi March 5th 2026 Today Episode : రేఖపై అపర్ణ ఉగ్రస్వరూపం.. సుభాష్‌ను తోసేసిన భూషణ్.. కావ్య, రాజ్ లాగే ఇందు, రాజు పరిచయం

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: March 5, 2026, 9:00 am

Brahmamudi March 5th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ ‘బ్రహ్మముడి’ Brahmamudi రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కథ నడుస్తోంది. కావ్య, రాజ్ ల కూతురు ఇందు పడుతున్న కష్టాలు, అపర్ణ, సుభాష్ ల దీనస్థితి ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక నేటి మార్చి 5 ఎపిసోడ్ లో రుద్రాణి ఫొటో పగలడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. మరోవైపు రాజ్, కావ్యలు ఎలాగైతే గొడవతో పరిచయం అయ్యారో.. ఇప్పుడు వాళ్ల పిల్లలు ఇందు, రాజులు కూడా అదే తరహాలో యాక్సిడెంట్ తో పరిచయం కావడం ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.

Brahmamudi March 5th 2026 Today Episode : రేఖపై అపర్ణ ఉగ్రస్వరూపం.. సుభాష్‌ను తోసేసిన భూషణ్.. కావ్య, రాజ్ లాగే ఇందు, రాజు పరిచయం

Brahmamudi March 5th 2026 Today Episode : రేఖపై అపర్ణ ఉగ్రస్వరూపం.. సుభాష్‌ను తోసేసిన భూషణ్.. కావ్య, రాజ్ లాగే ఇందు, రాజు పరిచయం

Brahmamudi March 5th 2026 Today Episode నీళ్ల కోసం రచ్చ చేసిన రాజు (స్వరాజ్)

ఎపిసోడ్ ప్రారంభంలో బస్తీలో నీళ్లు పట్టుకునే చోట రాజు (స్వరాజ్) కాలనీ ఆడవాళ్లతో పెద్ద గొడవకు దిగుతాడు. మమ్మల్ని మోసం చేసి నీళ్లు పట్టుకుంటావా అంటూ ఆడవాళ్లంతా రాజును చుట్టుముట్టి చితకబాదుతారు. వాళ్ల నుంచి ఎలాగోలా తప్పించుకుని రాజు నీళ్లు పట్టుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే తండ్రి క్లాస్ పీకుతాడు. “ఆడవాళ్లతో బిందెలతో కొట్టించుకుంటావా? నువ్వు చేసే గొడవలతో వాళ్ల మొగుళ్లతో విడాకులు అయ్యేలా ఉన్నాయి. రేపటి నుంచి నేను నీళ్లు తేను” అని రాజు అంటే, తండ్రి మాత్రం వాడికి పెళ్లి చేసి పంపించేద్దాం అంటాడు. దానికి రాజు “నాకు చేసుకోబోయే పిల్ల కోటలో మహారాణిలా ఉండాలి. పనివాళ్లతో పని చేయించుకుంటూ, నాకోసం కలలు కంటూ ఉంటుంది” అని బిల్డప్ ఇస్తాడు.

Brahmamudi March 5th 2026 Today Episode రుద్రాణి ఫొటో పగలడంతో రేఖ ఫైర్

మరోవైపు ఇంట్లో ఇందు ఉదయాన్నే లేచి రుద్రాణి, రాహుల్‌ల ఫొటోలు శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో స్వాతి అక్కడికి వచ్చి తన సిలబస్‌లో ఉన్న ఓ డౌట్ క్లియర్ చేయమని అడుగుతుంది. “వీళ్లేమైనా దేశభక్తులా రోజూ దండం పెట్టడానికి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం అని నానమ్మ చెప్పింది” అంటూ స్వాతి కామెంట్ చేస్తుంది. ఇంతలో స్వాతి ఆడుకుంటూ ఇందును లాగడంతో ప్రమాదవశాత్తు రుద్రాణి ఫొటో కిందపడి పగిలిపోతుంది. ఆ శబ్దానికి భ్రమరాంబ వచ్చి, రేఖకు వాళ్ల అమ్మ అంటే ఎంత ప్రాణమో తెలిసి కూడా ఇలా చేశావా అని ఇందును తిడుతుంది. ఇంతలో రేఖ ఎంట్రీ ఇస్తుంది. ఫొటో పగలడం చూసి కోపంతో రగిలిపోతుంది. “మా అమ్మ ఫొటో పగులగొట్టావంటే నేనంటే భయం పోయిందా?” అని ఇందును కొట్టడానికి చేయి ఎత్తుతుంది.

రేఖపై అపర్ణ ఉగ్రస్వరూపం.. కావ్య పేరుతో వార్నింగ్

ఇందును కొట్టబోయిన రేఖను చూసి అపర్ణకు ఎక్కడలేని కోపం వస్తుంది. రేఖపై తీవ్ర స్థాయిలో తిరగబడుతుంది. “నా మనవరాలి మీద చేయి పడితే ఊరుకోను. పగిలిపోయింది అఫ్ట్రాల్ రుద్రాణి ఫొటోనే కదా. మీ అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. జాలిపడి ఆశ్రయం ఇస్తే వెన్నుపోటు పొడిచి నా కుటుంబాన్ని దూరం చేసింది. అలాంటి దాని ఫొటో ఇంట్లో ఉండటమే పాపం” అని రుద్రాణిని తిడుతుంది. అలాగే “ఇందు కావ్య కూతురు అన్న విషయం గుర్తుంచుకో. కావ్య బతికి ఉన్నప్పుడు మీ అమ్మను ఏం చేసిందో మర్చిపోకు. కావ్య రక్తమే ఇందులో ప్రవహిస్తోంది” అని వార్నింగ్ ఇస్తుంది. సుభాష్ కూడా మాట్లాడుతూ.. “ఇందులో ఒక్కసారి కావ్య కోపం బయటకు వస్తే మీ జీవితాలు తలకిందులు అవుతాయి” అని అంటాడు.

సుభాష్‌ను మెట్లపై నుంచి తోసేసిన భూషణ్

అపర్ణ, సుభాష్ ల ధైర్యం చూసి రేఖకు ఇగో హర్ట్ అవుతుంది. తన మీద భయం పోయిందని రగిలిపోతుంది. “ఈరోజు నా మీదే నోరు లేచిందంటే మీకు భయం పోయినట్లే. మీలో పుట్టుకొచ్చిన ఈ ధైర్యాన్ని ఇక్కడే చంపేస్తాను” అని రేఖ సైగ చేయగానే.. ఆమె భర్త భూషణ్ విచక్షణ కోల్పోయి వీల్ చైర్ లో ఉన్న సుభాష్‌ను దారుణంగా మెట్లపై నుంచి కిందకు తోసేస్తాడు. సుభాష్ కిందపడి నొప్పితో విలవిలలాడతాడు. ఇందు, అపర్ణ కన్నీరుమున్నీరు అవుతూ సుభాష్ ను లేపి పడుకోబెడతారు. “మీరు మనుషులా రాక్షసులా” అని అపర్ణ ఏడుస్తుంది. పరిస్థితి చేయిజారిపోతుండటంతో ఇందు తన కోపాన్ని దిగమింగుకుని రేఖకు క్షమాపణలు చెబుతుంది. “వాళ్ల తప్పుకు నువ్వు సారీ చెప్పావ్ కాబట్టి, ఇకపై వాళ్లు తప్పు చేసినా శిక్ష నీకే పడుతుంది” అని రేఖ కండిషన్ పెడుతుంది. అనంతరం అపర్ణతో ఇందు మాట్లాడుతూ.. “రేఖ లాంటి వాళ్లను ఎదిరించాలంటే ఆవేశం కాదు, సమయం కలిసిరావాలి. పాపం పండాలి, అప్పటివరకు ఓపిక పట్టాలి” అని ధైర్యం చెబుతుంది.

హిస్టరీ రిపీట్.. కావ్య, రాజ్ లాగే ఇందు, రాజుల పరిచయం!

ఇంట్లో గొడవ సద్దుమణిగిన తర్వాత ఇందు ఎగ్జామ్ రాయడానికి కారులో బయల్దేరుతుంది. కట్ చేస్తే.. గతంలో సీరియల్ ప్రారంభంలో కావ్య, రాజ్ లు ఎలాగైతే కారు, బైక్ యాక్సిడెంట్ తో గొడవపడి పరిచయం అయ్యారో.. సరిగ్గా అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఇందు వెళ్తున్న కారుకు, రాజు బైక్ తో వచ్చి గుద్దుతాడు. కావాలనే యాక్సిడెంట్ చేసి, తన బోన్స్ బ్రేక్ అయ్యాయని, ఎమ్మార్ఐ స్కాన్ చేయాలని, డబ్బులు లాగాలని రాజు డ్రామాలు ఆడతాడు. కానీ ఇందు వాడికంటే తెలివిగా రివర్స్ కౌంటర్ ఇస్తుంది. ఇద్దరి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతుంది.

ఆనాడు రాజ్, కావ్యల పరిచయం ఎలా జరిగిందో, నేడు ఇందు, రాజుల పరిచయం కూడా అదే తరహాలో జరగడం ప్రేక్షకులకు పాత రోజులను గుర్తు చేస్తుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ గొడవ తర్వాత ఇందు, రాజుల మధ్య కథ ఎలా మలుపు తిరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp