Brahmamudi 5 Oct Today Episode : చీటీ చదివి కావ్య షాక్.. ప్రేమగా నటించాడని రాజ్‌పై కోపం పెంచుకున్న కావ్య.. రాజ్‌ని వదిలేసి పేరెంట్స్ తో పుట్టింటికి వెళ్లిపోయిన కావ్య

Brahmamudi 5 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు అక్టోబర్ 5, 2023 గురువారం ఎపిసోడ్ 219 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టగ్ ఆఫ్ వార్ అనేది కరెక్ట్ కాదు.. జంటలుగా పరీక్షలు పెట్టండి అని అందరూ అంటారు. దీంతో జంటలకు ఒక పరీక్ష పెడతాడు సీతారామయ్య. బాణం ఆట పెడతాడు సీతారామయ్య. విల్లుతో బాణాన్ని ముందు గురి పెట్టి కరెక్ట్ ప్లేస్ లో కొట్టిన జంటే వినాయకుడి పూజ చేయడానికి అర్హులు అవుతారని సీతారామయ్య చెబుతాడు. దీంతో ఒక్కొక్క జంట వచ్చి ట్రై చేస్తారు. రాహుల్, స్వప్న జంట కొట్టలేకపోతారు. కళ్యాణ్ అప్పును పిలుస్తాడు. కానీ.. మీరెందుకు అని చెప్పి అనామిక వెళ్లి ఇద్దరం కలిసి కొడదాం అని చెబుతుంది. కళ్యాణ్, అనామిక కలిసి కొడతారు కానీ.. గెలవరు. ఆ తర్వాత రాజ్, కావ్య ఇద్దరూ కలిసి కొట్టడానికి వెళ్తారు. ఆడటం వచ్చా అని అడుగుతాడు కావ్య. దీంతో మీకు ఆడటం వచ్చా అని అడుగుతాడు రాజ్. నేను చెప్పినట్టు చేయి. ముందు ఇది కరెక్ట్ గా పట్టుకో అంటాడు రాజ్. ఇద్దరూ కలిసి ఆర్చరీ ఆడుతుంటారు. ఆ బోర్డు మధ్యలో ఉన్న డాట్ ను చూడు. దాన్ని బర్డ్ ఐ అంటారు. నీకు ఆ కన్ను తప్ప వేరే ఏదీ కనిపించకూడదు అంటాడు.

దీంతో చూస్తూ చూస్తూ పక్షి కన్నును ఎలా కొట్టగలం చెప్పండి.. పాపం అనిపిస్తోంది అంటుంది కావ్య. అయితే నా కన్ను అనుకో అంటే సరే గట్టిగా కొడతా అంటుంది కావ్య. బాడీని స్ట్రెయిట్ గా పెట్టు అని తన నడుమును పట్టుకొని గట్టిగా లాగుతాడు రాజ్. దీంతో కావ్యకు ఏదోలా అవుతుంది. ఆ తర్వాత రాజ్ బాణం వేస్తాడు. దీంతో కరెక్ట్ గా బోర్డు మధ్యలో ఉన్న డాట్ వద్ద పడుతుంది బాణం. దీంతో రాజ్, కావ్య గెలుస్తారు. దీంతో రాహుల్, రుద్రాణికి చాలా కోపం వస్తుంది. మనం గెలవాల్సింది కదా కవి గారు అని అనామిక అంటుంది కళ్యాణ్ తో. ఎవరి గెలిస్తే ఏంటి అంటాడు కళ్యాణ్. మరోవైపు ఈ ఆటలో రాజ్, కావ్య గెలిచారు కాబట్టి వాళ్లే పూజ జరిపిస్తారు అని అంటాడు సీతారామయ్య. ఇక.. ఇదే కరెక్ట్ టైమ్ వెళ్లి ఆ చీటీని దొంగలించాలి అని అనుకుంటుంది కావ్య. వెంటనే ఎవరూ లేనిది చూసి వెళ్లి వినాయకుడి దగ్గర ఉన్న బౌల్ లో ఉన్న చీటీని దొంగలిస్తుంది. ఇంతలో ఇంద్రాదేవి పిలవడంతో దాన్ని చదవకుండానే వెళ్తుంది.

#image_title

Brahmamudi 5 Oct Today Episode : కళ్యాణ్ పై అప్పు సీరియస్

మరోవైపు అప్పు ఏదో దీనంగా కూర్చొని ఉంటుంది. ఇంతలో ధాన్య లక్ష్మీ వచ్చి అప్పు ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అంటుంది. ఈ పూలు గుమ్మానికి కట్టవా అంటుంది. దీంతో సరే అంటుంది అప్పు. ఇంతలో కళ్యాణ్ వచ్చి బ్రో నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు బ్రో అంటాడు కళ్యాణ్. దీంతో నేనేమైనా నీ అసిస్టెంట్ అనుకున్నావా.. నీ అనామిక నీకు దొరికింది కదా. నాతో ఇక ఈ ముచ్చట్లు ఏంది అని అంటుంది అప్పు.

బ్రో గట్టిగా అరవకు బ్రో.. అందరూ వింటారు అంటే.. నేను మాట్లాడటం నీకు అరుపులా ఉందా అంటుంది అప్పు. దీంతో నేను అనామికను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అంటాడు. దీంతో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంది అంటుంది అప్పు. మరోవైపు వినాయకుడి పూజను స్టార్ట్ చేస్తారు. ఆ చీటీని చీరకొంగులో ముడి పెడుతుంది కావ్య.

ఇద్దరిని కలిసి పూజ చేయాలని చెబుతారు. దీంతో ఇద్దరూ వెళ్లి పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరూ ఘనంగా పూజ చేస్తారు. ఆ పూజ మనం చేయాల్సింది. మిస్ చేశావు అని కళ్యాణ్ తో అనామిక అంటుంది. పూజ అయ్యాక అందరికీ హారతి ఇస్తుంది కావ్య.

పూజ పూర్తవగానే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి రాజ్ కి ఇచ్చి అవి మూర్తికి ఇవ్వమని చెబుతుంది. మొన్న తాతయ్య గారి ముందు ఈ వినాయచకవితి ఫంక్షన్ లో మా ఆయన చేతుల మీదగా మా నాన్నకు ఇప్పిస్తా అని చెప్పా కదా అంటుంది కావ్య. ఇవ్వు రాజ్ అంటాడు తాతయ్య. దీంతో సరే అని మామయ్య గారు, అత్తయ్య గారు అని పిలుస్తాడు రాజ్.

రండి అంటాడు. డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఇక నుంచి ఏ సమస్యలు రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటూ మీ ఇంటి పేపర్స్ ను మీ చేతుల్లో పెడుతున్నాను అంటాడు రాజ్. దేవుడిలా మీరు మాకు అండగా ఉండగా మాకు ఏ సమస్యలు రావు బాబు అంటాడు మూర్తి. ఇద్దరూ రాజ్ కు నమస్కరించబోగా వద్దండి.. మీరు ఆశీర్వదించాలి కానీ.. మాకు మొక్కొద్దు అంటాడు రాజ్.

రాజ్ కి కనకం, మూర్తి ఇద్దరూ ధన్యవాదాలు చెబుతారు. మీరెప్పుడూ ఇలాగే పది కాలాలు సంతోషంగా ఉండాలి అంటుంది కనకం. మరోవైపు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడతారు. తనకు టైమ్ దొరకగానే తన దగ్గర ఉన్న చిట్టీని బయటికి తీసి చదువుతుంది. తాతయ్యకు ఇచ్చిన మాట కోసమే కళావతితో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నానని రాజ్ చిట్టీలో రాయడం చదివి కళావతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

AI Edge Gallery | ఇంటర్నెట్‌ లేకున్నా ఏఐతో పనిచేసే గూగుల్ కొత్త యాప్ ఏంటో తెలుసా?

AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్‌…

11 minutes ago

Kalisundam Raa | ‘కలిసుందాం రా’ చిత్రాన్ని ఆ హీరో అలా ఎలా మిస్ చేసుకున్నాడు.. 24 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చలోకి!

Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…

1 hour ago

TG Govt | ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఊరట .. నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం

TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…

5 hours ago

Accenture | విశాఖకు రానున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం .. 12 వేల మందికి ఉద్యోగాలు

Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్క‌డ‌ భారీ…

5 hours ago

Digital Arrest | పహల్గాం ఉగ్రదాడిని కూడా వాడేసుకున్న నేరస్తులు .. 26 లక్షలు కోల్పోయిన వృద్ధుడు

Digital Arrest |  సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…

7 hours ago

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సినిమా ఆపేస్తున్న తేజ సజ్జా.. మెగా ఫ్యాన్స్ ఫిదా

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…

9 hours ago

Cashew Nuts | జీడిపప్పు ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త.. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…

10 hours ago

Belly Fat | బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఈ ఆహారాలు మానేయండి .. ఇక ర‌మ‌న్నా రాదు..!

Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…

11 hours ago