#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయి అప్పుడే నెల రోజులు దాటింది. నెల దాటిన తర్వాత ప్రస్తుతం హౌస్ లో 10 మంది మాత్రమే ఉన్నారు. 10 మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో పక్కన పెడితే పవరాస్త్ర టాస్కులు పక్కన పెట్టిన బిగ్ బాస్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్కులను కంటెస్టెంట్లతో ఆడిస్తున్నాడు. బిగ్ బాస్ 7 లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ను ప్రారంభించినా అంతా కన్ఫ్యూజన్ తో స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. బిగ్ బాస్ క్లారిటీగానే చెప్పినా.. ఇంటి సభ్యులే ఆ టాస్కులను ఆగమాగం చేశారు. వాళ్లలో వాళ్లకే క్లారిటీ లేకుండా చేశాడు. స్మైలీ టాస్కులో అయితే సంచాలకులుగా శోభా శెట్టి, యావర్ ను పెట్టగా.. వాళ్లు కూడా గేమ్ లో పార్ట్ కాబట్టి ఎవరు ఎలా ఆడుతున్నారో చూసుకోలేకపోయారు. దీంతో ఇద్దరూ కలిసి సరైన జడ్జిమెంట్ తీసుకోలేకపోయారు. దీంతో వాళ్ల జడ్జిమెంట్ ను ఎవ్వరూ ఒప్పుకోరు. వాళ్లకు క్లారిటీ లేదు. ఇంట్లో ఎవ్వరు కూడా వాళ్ల నిర్ణయాన్ని ఒప్పుకోరు. దీంతో ఏం చేయాలో యావర్, శుభశ్రీకి అర్థం కాదు. ఇక అమర్ అయితే.. కావాలని శుభశ్రీకి ఫేవరిజం చూపించాడని రచ్చ రచ్చ చేస్తాడు.
ఇది బయాస్ డిసిజన్ అని యావర్ తో శివాజీ చెబుతాడు. ఆ తర్వాత బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్ లో ఓ వ్యక్తి పడుకొని ఉన్నాడని.. అందులో బిగ్ బాస్ వస్తువులను ఆ వ్యక్తి దొంగలించాడని.. అతడికి తెలియకుండా బిగ్ బాస్ వస్తువులను తీసుకురావాలని రెండో టాస్క్ పెడతాడు బిగ్ బాస్. ఈ రెండో టాస్క్ లో కూడా అంతా గందరగోళం. బిగ్ బాస్ చెప్పింది కాకుండా.. బిగ్ బాస్ చెప్పనివి కూడా చేస్తారు. బిగ్ బాస్ చెప్పిన వస్తువులే తీసుకురావాలి అని చెప్పగా.. బిగ్ బాస్ చెప్పని వస్తువులను కూడా తీసుకుంటారు ఇంటి సభ్యులు. దీంతో ఆ గేమ్ లో బిగ్ బాస్ చెప్పని తక్కువ వస్తువులు తీసుకొని విజేతలుగా నిలుస్తారు శివాజీ, ప్రశాంత్. ఫస్ట్ టాస్క్ లో శుభశ్రీ, గౌతమ్ నిలుస్తారు.
#image_title
ఇక.. మూడో టాస్క్ లో భాగంగా ఫ్రూట్ నింజా అనే టాస్క్ ను పెడతాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఒక వ్యక్తి దూరంగా లైన్ ముందు నిలుచొని మరో వ్యక్తి నెత్తి మీద ఉన్న బుట్టలో బత్తాయిలను పడేయాలి. అలా పడేసిన తర్వాత వాటిని పిండి జ్యూస్ చేసి ఇచ్చిన జార్ నింపాలి. ఈ టాస్క్ లో యావర్ విజేతగా నిలుస్తాడు. రెండో స్థానంలో మాస్టర్ నిలుస్తాడు. మూడో స్థానంలో శివాజీ నిలుస్తాడు. ఈ టాస్క్ లో సంచాలకుడిగా అమర్ వ్యవహరిస్తాడు. టాస్క్ మొత్తం పూర్తయ్యాక శివాజీ, అమర్ కి 4 స్టార్లు, శుభశ్రీ, గౌతమ్ కు నాలుగు స్టార్లు, శివాజీ, ప్రశాంత్ కు ఐదు స్టార్లు, ప్రియాంక, శోభా శెట్టికి రెండు స్టార్లు, యావర్, తేజాకు మూడు స్టార్లు వస్తాయి.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.