Brahmanandam : ఎల్బీ శ్రీరామ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన బ్రహ్మానందం..!
Brahmanandam : దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ ఉత్సవం ‘. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హార్న్ బిల్ పిక్చర్ పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ వేడుకకు బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం అతిథులుగా […]
ప్రధానాంశాలు:
Brahmanandam : ఎల్బీ శ్రీరామ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన బ్రహ్మానందం..!
Brahmanandam : దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ ఉత్సవం ‘. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హార్న్ బిల్ పిక్చర్ పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంచ్ వేడుకకు బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం అతిథులుగా హాజరయ్యారు. కళాకారుడు చనిపోవచ్చు గాని కల చనిపోకూడదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో మొదలైన టీజర్ అత్యంత ఎమోషనల్ అనుభూతిని ఇచ్చింది. టీజర్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, నాజర్, ఆలీ, ప్రేమ, ఆమని, ప్రియదర్శిలాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించారు.
దిలీప్ ప్రకాష్ స్క్రీన్ ప్రజెంట్ అద్భుతంగా ఉంది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్ర పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ అర్జున్ సాయి ఇంతమంది వర్సటైల్ యాక్టర్స్ వారి పాత్రలోని ఎమోషన్ ని టీజర్ లో అద్భుతంగా చూపించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఆకట్టుకుంది. రసూల్ ఎల్లోర్ వండర్ఫుల్ విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి. మొత్తానికి టీజర్ ఉత్సవం పై చాలా ఆసక్తిని పెంచింది. ఇక ఈ టీజర్ లాంచ్ వేడుక సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ..నటులు, నట జీవితం అంటే నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్.
ఆర్ట్ ఇస్ లాంగ్ లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకు మిగిలిపోయేది కళ మాత్రమే. కళాకారులందరిని ఒక చోటికి చేర్చి వీరిపై ఒక సినిమా చేయాలని ఆలోచన చేసిన డైరెక్టర్ అర్జున్ సాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు. ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలి అంటే ధైర్యంతో పాటు సినిమాటిక్ గా చెప్పే నేర్పు కావాలి. ఇంతమంది నటీనటులను ఒక్క చోటికి చేర్చి చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. అందరు అద్భుతమైన నటన ప్రదర్శించారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. విభిన్నమైన కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కళకు ఆయువుపట్టు నాటక రంగం. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దిలీప్ ప్రకాష్ చక్కని నటన కనబరిచాడు. రంగస్థలం గురించి ఈ సినిమా గురించి దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉత్సవం తీర్చిదిద్దారు. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది అని బ్రహ్మానందం అన్నారు.