Mahesh Babu : బ్రహ్మానందం కోసం మహేష్ బాబు తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : బ్రహ్మానందం కోసం మహేష్ బాబు తీసుకున్న నిర్ణయానికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే !

 Authored By aruna | The Telugu News | Updated on :1 July 2023,1:00 pm

Mahesh Babu : టాలీవుడ్ లో కమెడియన్ గా బ్రహ్మానందం మొదటి ప్లేస్ లో ఉన్నారు. కమెడియన్ గా ఆయన ఎన్నో వందల సినిమాలలో నటించారు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అందుకే దర్శకులు కూడా తమ సినిమాల్లో ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం కామెడీ సీన్స్ రాసుకుంటారు. అంతలా తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం కామెడీ అంటే అంత ఇష్టం. అసలు బ్రహ్మానందం స్క్రీన్ పై కనిపిస్తే చాలు జనాలు నవ్వేస్తారు. వందల చిత్రాల విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం ఆయన కామెడీ కారణంగానే ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో కూడా బ్రహ్మానందం కి స్క్రీన్ స్పేస్ తో కూడిన కామెడీ ఎపిసోడ్స్ ఉంటాయి.

మహేష్ బాబు సినిమాల్లో అతడు, దూకుడు చాలా ప్రత్యేకం. కామెడీ అండ్ యాక్షన్ సమాన స్థాయిలో వర్కౌట్ అయిన చిత్రాలు ఇవి. ఈ రెండు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయినవి. ఇటీవల బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించేశారు. అలాగే కామెడీ పక్కనపెట్టి సీరియస్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన రంగమార్తాండ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేసి కన్నీరు పెట్టించారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలో బ్రహ్మానందం ని చూడబోతున్నామట. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం నటించాలని మహేష్ బాబు పట్టు పట్టారట.

Brahmanandam in Mahesh Babu movie

Brahmanandam in Mahesh Babu movie

త్రివిక్రమ్ కి చెప్పి ఆయన కోసం కామెడీ సీన్ రాయించాడట. బ్రహ్మానందం కూడా దీనికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. దీంతో మహేష్ బాబు బ్రహ్మానందం కాంబినేషన్ రిపీట్ అయిందంటున్నారు. బ్రహ్మానందం త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. మరో హీరోయిన్గా పూజ హెగ్డేను తీసుకున్నారు కానీ ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది