
Acharya : ఆచార్య షూటింగ్ కి బ్రేక్ పడింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 152వ సినిమాగా తెరకెక్కుతోంది ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి తనయుడు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్ కి జంటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ వెల్లడించడంతో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.
break-for-achraya-shooting-due-to-chiranjeevi-health-issue
కాగా సడన్‌గా ఆచార్య సినిమాకి బ్రేక్ ఇచ్చాడట కొరటాల శివ. అందుకు కారణం మెగాస్టార్ కి ఉన్నట్టుండి ఆరోగ్య సమస్యలు తలెత్తడమేనని తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో పాటు మరొక సినిమాని సెట్స్ మీదకి తీసుకురావాలని ప్లాన్ లో ఉన్న మెగాస్టార్ విరామం లేకుండా ఆచార్య షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఖమ్మం ఇల్లందు బొగ్గు గనుల్లో చిత్రీకరణ సాగుతోంది. చిరంజీవి, రామ్ చరణ్‌లపై దర్శకుడు కొరటాల కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ క్రమంలో బొగ్గు గనుల ప్రాంతం కావడంతో వేడి అధికంగా ఉండటం వలన చిరంజీవికి డీ హైడ్రేషన్ సమస్య వచ్చిందట. దాంతో ఆచార్య షూటింగ్ ఉన్నపలంగా నిలిపివేశారు. చిరంజీవి ఆరోగ్యం కుదటపడ్డాక తిరిగి మళ్ళీ ఆచార్య సెట్స్ మీదకి వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. కాగా ఆచార్య కంప్లీట్ అవగానే చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.