AP BRS : ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కోడి పందెం రాజకీయాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP BRS : ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కోడి పందెం రాజకీయాలు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :10 January 2023,1:40 pm

AP BRS : బీఆర్ఎస్ రాజకీయాలు కాస్త ఏపీకి పాకాయి. తెలంగాణలో ఎలాగూ బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేవాడు లేడు. ఇక.. ఆ తర్వాత మరో తెలుగు రాష్ట్రం ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే తెలంగాణతో పాటు ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసిపోయి ఏపీలోని రాజకీయాలకు ఒక్కసారిగా యూటర్న్ చేశారు. మరోవైపు ఏపీలో మకాం వేసేందుకు బీఆర్ఎస్ కూడా తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగూ వచ్చేది సంక్రాంతి కాబట్టి.. ఈ సంక్రాంతి సమయంలోనే ఏపీలో పాగా వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలపై

సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.అందులో భాగంగా ఏపీలో ముందు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఏపీకి చెందిన పులువురు నాయకులను, సరిహద్దు జిల్లాల నేతలను బీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది బీఆర్ఎస్. సంక్రాంతి తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించాలని సీఎం కేసీఆర్ భావిస్తుండగా.. సంక్రాంతిలోపే ఏపీలో పార్టీని ఒక గాడిన పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. నిజానికి.. సీఎం కేసీఆర్ ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలో.. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో పలువురు నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నెట్ వర్క్ ను వాడుకొని ఏపీలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

brs to do ap politics for sankranthi

brs to do ap politics for sankranthi

AP BRS : సంక్రాంతి వేదికగా ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలు

పాత పరిచయాలను వాడుకోవాలని అనుకుంటున్నారు. దానికి సంక్రాంతే సరైన సమయం అని భావిస్తున్నారు. దానికి కారణం.. సంక్రాంతికి ఏపీలో జరిగే కోడి పందేలు. ఏపీలో కోడి పందేలు ఫేమస్ అనే విషయం తెలుసు కదా. వాటిని వాడుకొని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే.. కోడి పందేలను చూడటానికి, ఆడటానికి తెలంగాణ నుంచే కాకుండా చాలా మంది రాజకీయ ప్రముఖులు వెళ్తారు. అక్కడే అందరు రాజకీయ నేతలు కలుస్తారు కాబట్టి అక్కడే బీఆర్ఎస్ పార్టీని స్ట్రాంగ్ చేసుకునే అవకాశం దొరుకుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి సంక్రాంతి పండుగ అయిపోయే లోపు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కార్యక్రమం ఎంత దూరం వెళ్తుందో?

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది