Bruce Lee : ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నిజాలు .. బ్రూస్ లీ చనిపోయిన యాభై ఏళ్లకి బయటపడిన దారుణం !
Bruce Lee : హాలీవుడ్ యాక్షన్ స్టార్ మాస్లాట్ లెజెండ్ బ్రూస్లీ గురించి అందరికీీ తెలుసు. ఈయన హాంకాంగ్ పరిశ్రమలోని ప్రసిద్ధ మార్శలాట్ కళాకారుడు. నటుడుగా ఈయనకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్నారు. అయితే 1973 వేసవిలో 32 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బ్రూస్ లీ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఇక అప్పట్లో అతని ప్రత్యర్థులు అతనికి విషం ఇచ్చి చంపేశారని కథలు వచ్చాయి. అయితే ఈ మరణం అనంతరం దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత వైద్యులు దీనిపై విచారణ మొదలుపెట్టడం సంచలనంగా మారింది. అయితే అప్పటి శవపరీక్ష నివేదికలో బ్రూస్లీ మెదడువాపు తో మరణించినట్లుగా తెలిపారు.
నొప్పి నివారణ మందులు ఎక్కువగా తీసుకోవడం వలన ఈ మరణం సంభవించిందని అప్పట్లో వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి పరిశోధకులు సాక్షాలను సమీక్షిస్తున్నారట. అప్పట్లో వైద్యులు చెప్పినట్లు బ్రూస్ లీ ఆ కారణంతో కాకుండా వేరే కారణంతో మరణించారని చెబుతున్నారు. అయితే బ్రూస్ లీ హైపోనాట్రేమియా అనే అరుదైన జబ్బుతో మరణించినట్టుగా నిర్ధారిస్తున్నారు. అయితే ఇప్పుడు నిపుణుల బృందంతో కూడిన ప్రముఖ క్లినిక్ కిడ్నీ జనరల్ లో ఓ వ్యాసం సంచలనంగా మారింది. ఒక్క మాట లో చెప్పాలంటే బ్రూస్ లీ శరీరం నుంచి అదనపు నీటిని బయటకు పంపే కిడ్నీ ఫెయిల్ అయిందట . ఇక ఈ కారణంగానే బ్రూస్లీ చనిపోయాడని నిర్ధారించారు.
మూత్రపిండాలు పనిచేయకపోవడం వలన బ్రూస్లీ మరణించాడని ఓ కథనంలో రాశారు. అయితే బ్రూస్ లీ “నా మిత్రమా నీటిలో ప్రవహించు నీరులా ఉండు” అని అందరికి చెబుతుండేవాడట. కానీ దురదృష్టవశాత్తు అదే అదనపు నీరు అతన్ని చంపినట్లు తెలుస్తోంది. ఇక దీనిని వారిలోనే ఒకరు వ్యాఖ్యానించారు. అయితే బ్రూస్లీకి ఇలా అవడానికి గల కారణాలను అధ్యయనం పేర్కొంది. అధిక పరిమాణంలో ద్రవం త్రాగడం, గంజాయిని ఉపయోగించడం వలన శరీరంలో దాహాన్ని మరింతగా పెంచుతాయి. అలాగే ద్రవ సమతుల్యతను వేరు చేస్తుందట. ఆ సమతుల్యత వలన మెదడులోని ఆ కణాలు మరియు శ