Pushpa 2 : పుష్ప‌ 2 కోసం రంగంలోకి ఉప్పెన డైరెక్ట‌ర్.. సుకుమార్ ఏమ‌య్యాడు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 28 July 2022, 3:20 pm

Pushpa 2 : గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా ఇంటా బ‌య‌టా నానా ర‌చ్చ చేస్తుంది. ఇప్ప‌టికీ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది. పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప- 1 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో బీ టౌన్‌లో కూడా క్రేజ్ కొట్టేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం రెండో పార్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లుక్ మొత్తం చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.

‘పుష్ప2’ కథా చర్చలకు సంబంధించిన విషయాల్లో సుకుమార్ తో పాటు బుచ్చిబాబు కూడా పాలుపంచుకుంటున్నాడు. ‘పుష్ప 2’ పాన్ ఇండియా సినిమా కావడం వలన , సహజంగానే సుకుమార్ కి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నీ తెలిసిన ఇలాంటి ఒక శిష్యుడు అవసరమని భావించే ఆయన పిలిపించాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టు తరువాతనే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉంటుందని అనుకోవచ్చు.సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు, ఆయన ప్రోత్సాహంతోనే ‘ఉప్పెన’ సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

buchi babu joins in pushpa 2 work

buchi babu joins in pushpa 2 work

Pushpa 2 : శిష్యుడి సాయం..

ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా బుచ్చిబాబు చెప్పాడు పుష్ప తొలి భాగం సూపర్ సక్సెస్ కావడంతో ఈ రెండో భాగంపై ప్రతి ఒక్కరి చూపు పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తూ పుష్ప సినిమాను మించేలా తదుపరి భాగాలు ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. త్వ‌ర‌లోనే ఈ పుష్ప 2 సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 3 గురించిన వార్తలు వస్తుండటం జనాల్లో ఆసక్తిని ఇంకాస్త పెంచేసింది. దానికి కూడా సుకుమార్ త్వ‌ర‌లోనే ముహూర్తం పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

Sam C

No bio available for this author.

  1. "Ajinkya Rahane Retirement : బిగ్ బ్రేకింగ్‌.. అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు..!"

  2. "Spider Man Brand New Day Movie Review : స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  3. "Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. జూలై 30న తగ్గిన తాజా ధరలు"

  4. "Srinivasa Mangapuram Movie Review : శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  5. "Telangana Police Jobs : బిగ్ బ్రేకింగ్‌.. నిరుద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల!"

  6. "Mrunal Thakur : 24 ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందా? ఒక్క వీడియోతో సోషల్ మీడియా షాక్!"

  7. "Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు గోల్డెన్ ఫ్యూచర్.. ప్రపంచానికి కొత్త గేట్‌వే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి