Pan indian : పాన్ ఇండియన్ సినిమా అంటూ కోట్లలో బడ్జెట్ పెంచితే నష్టపోయేదెవరు.. దర్శకుడా.. హీరోనా.. నిర్మాతా..?
Pan indian : టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలే రూపొందుతున్నాయి. ఇందుకు భీజం వేసింది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. అసలు పాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటీ.. ఈ ప్రశ్న కి సమాధానం చాలా మందికి తెలిసిదే ఉండొచ్చు. ఒక కథ యూనివర్సల్ గా ఉంటే ఆ కథ ని సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించినప్పుడు ఏ ప్రాంతానికో… ఏ ఒక్క మతానికో సంబంధించిన సినిమాగా కాకుండా యావత్ భారత దేశంలోని ప్రతీ ప్రాంతం వారు చూసేలా ..ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా, అందరి హృదయాలను హత్తుకునేలా చూపించడమే.
బాహుబలి సినిమా ముందు వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ తరహా సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అందుకే హిందీ పరిశ్రమ మార్కెట్ పరిధి తెలుగు సినిమా కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. అంతేకాదు హిందీ భాషలో వచ్చే సినిమాలు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రిలీజ్ అవుతుంటాయి. కాని మన తెలుగు సినిమా కొన్నేళ్ళ ముందు వరకు ముంబై, బెంగళూరు చెన్నై లాంటి నగరాలలోనే చాలా తక్కువగా ప్రదర్శింపబడేవి. అయితే బాహుబలి సినిమాని యీనివర్సల్ కథాంశంతో రెండు భాగాలు గా తెరకెక్కించి అన్నీ ప్రధాన భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు.
Pan indian : ప్రభాస్ మాదిరిగా మిగతా స్టార్ హీరోలు కథ ఎంచుకుంటున్నారు.
ఈ సినిమా రెండు భాగాలకి అన్నీ ప్రాంతాల వారు ఆకర్షితులయ్యారు. చైనా, జపాన్ లాంటి దేశాలలో ఏకంగా బాహుబలి సినిమాలకి.. ప్రభాస్ కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలతో ప్రభాస్ కి ఇతర దేశాలలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. అంతగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి
ది బిగినింగ్, కన్‌క్లూజన్ ప్రభావం చూపించాయి. దాంతో తెలుగులో ఎక్కువ పాన్ ఇండియన్ సినిమాల హడావుడి మొదలైంది. ప్రభాస్ మాదిరిగా మిగతా స్టార్ హీరోలు అన్నీ భాషల్లో తమ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునేదిగా ఉండేలా ఎంచుకుంటున్నారు.
Pan indian : నాలుగు భాషల్లో డబ్ చేసి వదిలేస్తే ముందుగా దెబ్బ తినేది మాత్రం నిర్మాతే.
ఒక సినిమాని కనీసం నాలుగు భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఎంత తక్కువ పెట్టుకున్నా.. పాన్ ఇండియన్ సినిమా అంటే ఓ 200 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. ఒకప్పుడు మన తెలుగు సినిమా రేంజ్ 50 నుంచి 70 కోట్ల లోపే ఉండేది. కాని ఈ బడ్జెట్ కేవలం హీరో రెమ్యూనరేషన్ కే పోతోంది. ఇక దర్శకుడు రెమ్యూనరేషన్.. సినిమా బడ్జెట్ ..ఇతర భాషల్లలో అనువాదం.. లేదా రీమేక్ అంటే 200 కోట్లు కూడా సరిపోని పరిస్థితి. అయితే ఇలా ప్రతీ సినిమా యూనివర్సల్ గా కుదరదు. ఏదో కథ కి భారీ బడ్జెట్ పెట్టి తీసేసి నాలుగు భాషల్లో డబ్ చేసి వదిలేస్తే ముందుగా దెబ్బ తినేది మాత్రం నిర్మాతే.
పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా నష్టాల ఊబిలో కూరుకుపోతాడు. మళ్ళీ జీవితం లో సినిమా నిర్మించాలంటే ధైర్యం చేయడు. ఇక దర్శకుడు అన్నీ రకాలుగా విమర్శలు ఎదుర్కొంటాడు. అందరూ దూరం పెట్టేస్తారు. మళ్ళీ దర్శకుడిగా అవకాశం దక్కాలంటే తలకిందులుగా తపస్సు చేయాలి. ఆ తర్వాత హీరో.. ఒక్క సినిమా భారీ డిజాస్టర్ అయితే ఆ హీరో మార్కెట్ మొత్తం పడిపోతుంది. దర్శక, నిర్మాతలిద్దరు ఆ హీరో జోలికి వెళ్ళాలంటే ఆలోచిస్తారు. కోలీవుడ్ లో ఒక స్టార్ డైరెక్టర్ ది ఇదే పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు మొదలైతే ఇండస్ట్రీ సంక్షోభం లో పడటం ఖాయం అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ పాన్ ఇండియన్ సినిమాల మాట ఎంతకాలం వినిపిస్తుందో.