Apparao Lady Getup : జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు లేడీ గెటప్ కి ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా

Authored By aruna | The Telugu News | Updated on : 10 September 2022, 11:30 am

Apparao Lady Getup : చుట్టపు చూపుగా వచ్చి జబర్దస్త్ లో ఫుల్ టైం కమెడియన్ గా మారిపోయాడు బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు. ఆయన రోహిణి టీంలో ప్రస్తుతం యాక్టివ్ మెంబర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన జోరు చూస్తుంటే ముందు ముందు టీం లీడర్ పోస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా జబర్దస్త్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతి వారం జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో కనిపిస్తున్న అప్పారావు గారు ఇటీవల ఏకంగా లేడీ గెటప్ లో కనిపించాడు.

జబర్దస్త్ కమెడియన్స్ దాదాపు అంతా కూడా ఏదో ఒక సమయంలో లేడీ గెటప్ వేసిన వారే. ప్రతి కమెడియన్ లేడీ గెటప్ లో అలరించి ఎంటర్టైన్ చేసిన వారే. ఇప్పుడు అప్పారావు కూడా లేడీ గెటప్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఆయన లేడీ గెటప్ లో ఫుల్ వినోదాన్ని అందించడంతో పాటు ఒక మంచి కమెడియన్ అన్నట్లుగా పేరు సొంతం చేసుకున్నాడు. ఇన్నోసెంట్ కామెడీ చేయడంలో ఆయన ముందుంటాడు. ఏమీ తెలియనట్టే ఉంటాడు కానీ అన్ని విధాలుగా పంచ్ లు వేస్తాడు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. తాజాగా జబర్దస్త్ కోసం ఆయన లేడీ గెటప్ వేయడంతో ఏకంగా లక్ష రూపాయల పారితోషకాన్ని తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

bullet bhaskar father apparao lady getup remuneration

bullet bhaskar father apparao lady getup remuneration

సాధారణంగా 30 వేల నుండి 40 వేల రూపాయలు మాత్రమే ఆయనకు రోజువారి పారితోషికం ఉండేది. కానీ లేడీ గెటప్ వేయడంతో ఏకంగా లక్ష రూపాయలను ఆయనకు ఇచ్చినట్లుగా జబర్దస్త్ టీం మెంబెర్స్ చెబుతున్నారు. సాధారణంగా లేడీ గెటప్స్ వేసినంత మాత్రాన ఎక్కువ పారితోషికం ఇవ్వరు. కానీ పెద్దాయన అయినా అప్పారావు గారు లేడీ గెటప్ వేయడంతో అంత భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇచ్చారంటూ జబర్దస్త్ కి సంబంధించిన కొందరు చెబుతున్నారు. మొత్తానికి భారీ స్థాయిలో పారితోషకాన్ని తీసుకుంటూ అప్పారావు ఈ వయసులో పెద్ద మొత్తంలో సంపాదించేస్తున్నాడు. ముందు ముందు ఆయన ఇంకా ఎంత సంపాదిస్తాడో.. కొడుకుని మించి మరీ సంపాదిస్తాడేమో చూడాలి.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి