Hyper Aadi : ఏం చేయకుండా అంత సంపాదించావా?.. అఖిల్ పరువుతీసిన ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : ఏం చేయకుండా అంత సంపాదించావా?.. అఖిల్ పరువుతీసిన ఆది

Hyper Aadi : బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్‌కు అంతో ఇంతో క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు లక్ కొద్దీ రన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఓటీటీలోనూ తన బిహేవియర్, నేచర్‌తో రన్నర్‌గానే నిలిచాడు. బిగ్ బాస్ షో తప్ప అఖిల్‌కు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతకు ముందు సీరియల్స్‌లో విలన్ రోల్స్ చేసినా, సహాయ పాత్రల్లో నటించినా కూడా అంతగా గుర్తింపురాలేదు. బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక అంతగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,11:00 am

Hyper Aadi : బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్‌కు అంతో ఇంతో క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు లక్ కొద్దీ రన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఓటీటీలోనూ తన బిహేవియర్, నేచర్‌తో రన్నర్‌గానే నిలిచాడు. బిగ్ బాస్ షో తప్ప అఖిల్‌కు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతకు ముందు సీరియల్స్‌లో విలన్ రోల్స్ చేసినా, సహాయ పాత్రల్లో నటించినా కూడా అంతగా గుర్తింపురాలేదు. బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చాక అంతగా ఆఫర్లు కూడా ఏమీ రాలేదు. మోనాల్‌తో లవ్ ట్రాక్ అంతో ఇంతో వర్కవుట్ అయింది. మోనాల్ అఖిల్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు.

కానీ ఇంత వరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన అయితే రాలేదు. అలా మొత్తానికి అఖిల్‌కు మాత్రం ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ సమయంలోనే ఢీ షోకు వచ్చాడు. ఆ మధ్య ఢీ షోలో అఖిల్ బాగానే సందడి చేశారు. మళ్లీ ఓటీటీ నాన్ స్టాప్ షోకు వెళ్లడంతో ఢీ షోకు బ్రేక్ ఇచ్చాడు. నాన్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన అఖిల్.. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని అదే ఢీ షోకు వచ్చాడు. అసలే ఢీ షోలో ఆది ఆధిపత్యమే నడుస్తుంటుంది. అతగాడే అందరి మీద పంచులు వేస్తుంటాడు. వేరే వాళ్లకు చాన్స్ ఇవ్వడు.

Hyper Aadi On Akhil Sarthak Property in Dhee Show Latest Promo

Hyper Aadi On Akhil Sarthak Property in Dhee Show Latest Promo

అలాంటి ఆది వరుసగా అఖిల్ మీద సెటైర్లు వేస్తుంటాడు. షోలో అఖిల్ పరువుతీస్తుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ అఖిల్ మీద పంచులు వేశాడు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్లు అవుతోంది.. అని అఖిల్‌ను ఆది అడుగుతాడు. పదేళ్లు అవుతుంది అని అఖిల్ సమాధానం ఇస్తాడు. అబ్బో పదేళ్లు అంటే.. ఎంత సంపాదించావ్ అని మళ్లీ అడుగుతాడు. బాగానే సంపాదించాను అని అఖిల్ అంటాడు. అంటే ఏం చేయకుండానే అంత సంపాదించావ్ అంటే.. చేసి ఉంటే ఇంకెంత సంపాదించేవాడివో అని కౌంటర్లు వేశాడు. అంటే అఖిల్‌కు కనీసం నటన కూడా రాదని ఆది కౌంటర్లు వేశాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది