Home » Entertainment » Bullet Bhaskar Humiliates Jabardasth Varsha In Latest Promo
Entertainment

Jabardasth Varsha : వర్ష అసలు అమ్మాయేనా?.. పరువుతీసిన బుల్లెట్ భాస్కర్

Authored By
aruna
The Telugu News | Published on: July 24, 2022, 2:30 pm
Advertisement

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి ఎప్పుడూ వినిపించే కామెంట్ గురించి అందరికీ తెలిసిందే. వర్ష అసలు అమ్మాయేనా? లేడీ గెటప్పులా ఉంది.. మగాడిలా ఉంది అంటూ కామెంట్లు చేస్తుంటారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా ఏ షోలో అయినా సరే వర్ష మీద వేసే కామెంట్లు, జోకులు, సెటైర్లు మాత్రం అవే ఉంటాయి. ఎందుకంటే ఇక వర్ష మీద జోకులు వేయడానికి, కామెడీ చేయడానికి ఇంకేం లేదు. అయితే వర్ష కూడా వాటిని కొన్ని సందర్భాల్లో లైట్ తీసుకుంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో సీరియస్ అవుతుంటుంది. ఓ సారి ఇలానే స్టేజ్ మీద ఫైర్ అయింది. మగాడిలా ఉంటావ్.. లేడీ గెటప్ అని ఇమాన్యుయేల్ అనడంతో వర్ష హర్ట్ అయింది. అదంతా టీఆర్పీ కోసం చేసిందా?

Advertisement

నిజంగా అలా ఫీలైందా? అన్నది తెలియదు. కానీ వర్ష మాత్రం స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకుంది. ఇమాన్యుయేల్ సారీ కూడా చెప్పేశాడు. అయితే ఇప్పుడు తాజాగా వదిలిన ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ రెచ్చిపోయాడు. వర్ష మీద మళ్లీ అలాంటి కామెంటే చేశాడు. అసలు ఈ ప్రోమోలో ఏముందో ఓ సారి చూద్దాం. వర్ష, బుల్లెట్ భాస్కర్‌లు లవర్స్‌లా ఎంట్రీ ఇచ్చారు.నేను యాంకరింగ్ చేస్తున్నా కూడా నన్ను ఎవ్వరూ యాంకర్ అని అనడం లేదు.. గుర్తించడం లేదు అని వర్ష అంటుంది. నన్నే ఇంకా ఎవ్వరూ యాంకర్ అంటే నమ్మడం లేదు.. ఇంకా నిన్నేం నమ్ముతారు అని మధ్యలో రష్మీ కౌంటర్లు వేస్తుంది.

Bullet Bhaskar Humiliates Jabardasth Varsha in Latest Promo

Advertisement

నిన్ను యాంకర్ అంటే నమ్మడం లేదు కానీ అసలు వర్షను అమ్మాయి అంటేనే ఎవ్వరూ నమ్మడం లేదు అని పరువుతీస్తాడు బుల్లెట్ భాస్కర్. నువ్ అలానే అంటావ్.. కానీ నేను నడుచుకుంటూ వెళ్తే. ఈ సైడ్ నుంచి చూస్తే ఇంద్రజ అంటున్నారు..ఈ సైడ్ నుంచి చూస్తే కుష్బూ అంటున్నారు అని వర్ష రెచ్చిపోతుంది. స్ట్రెయిట్‌గా చూస్తే శాంతి స్వరూప్ అంటారు అని బుల్లెట్ భాస్కర్ కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. ఇక ఈ బుల్లెట్ భాస్కర్ స్కిట్లో ఫైమా, వర్షలు ఇద్దరూ దుమ్ముదులిపేస్తున్నారు. ఈ స్కిట్ బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి