
can ram charan breaks the sentiment
Ram Charan: సినిమా పరిశ్రమలో చాలా మంది స్టార్స్‌కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆ సెంటిమెంట్స్‌కి భయపడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని ఓ సెంటిమెంట్ వణికిస్తుంది. రీసెంట్ గా “ఆర్ఆర్ఆర్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
రాంచరణ్ కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న 50వ ప్రాజెక్ట్ కూడా. అంజలి, శ్రీకాంత్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫలితంపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక్కడే ఓ సెంటిమెంట్ కూడా హాట్ టాపిక్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి రూపొందించిన చిత్రం జులై 14న విడుదల అయ్యింది. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తమిళ దర్శకులు నేరుగా మన హీరోలుతో రూపొందించిన చిత్రాల ఫ్లాప్ విషయంలో ఓ చర్చ నడుస్తుంది. ఇంతకు ముందు ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్….మన స్టార్ హీరో మహేష్ తో స్పైడర్ చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
can ram charan breaks the sentiment
అలాగే విజయ్ దేవరకొండతో తమిళ దర్శకుడు స్టైయిట్ తెలుగు సినిమా నోటా చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు లింగుస్వామి మన స్టార్ రామ్ తో ది వారియర్ చేసారు. ఆ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా భాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అని తేలింది. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. కాని శంకర్ కి ఇటీవలి కాలంలో ఒక్కహిట్ లేదు. మరి రామ్ చరణ్‌తో హిట్ అనేది కొడతాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Bank Holidays in June 2026 : జూన్ నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తంగా ఉండాల్సిన…
Coconut Water : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…
Summer Drink : వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సాధారణ…
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
This website uses cookies.