Home » Entertainment » Samantha Next Mass Song Coming Soon
Entertainment

Samantha : మాస్ సాంగ్‌కి ఊ కొడుతున్న స‌మంత‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ర‌చ్చ‌

Authored By
Sam C
The Telugu News | Published on: July 17, 2022, 3:30 pm
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌లి కాలంలో స‌మంత దూకుడు మాములుగా లేదు. క‌థానాయిక‌గా న‌టిస్తూనే మాస్ సాంగ్స్‌తోను అద‌ర‌గొడుతుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసిన సమంత నార్తులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఆ వెబ్ సిరీస్లో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కారణంగా విడాకులు అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. ఏది ఏమైనా విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటం సాంగ్ మాత్రం మంచి క్రేజ్ తీసుకొచ్చింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

పుష్ప సినిమా త‌ర్వాత మ‌రో సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌లేదు. అయితే త్వ‌ర‌లోనే పుష్ప‌లోని మాస్ సాంగ్‌ను మించిపోయే మాస్ సాంగ్‌తో స‌మంత మెప్పించ‌నుంద‌నే వార్త‌లు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. అస‌లు విష‌యం ఏంటంటే.. స‌మంత తాజా చిత్రం య‌శోద‌. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఓ పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ప‌క్కా మాస్ సాంగ్‌. ఈ పాట‌లో మ‌రొక‌రిని న‌టింప చేస్తే ఏం బావుంటుంద‌ని స‌మంత భావించిందేమో ఏమో.. స‌ద‌రు మాస్ సాంగ్‌లో స్టెప్పులేయ‌డానికి స‌మంత ఒకే చెప్పేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

samantha next mass song coming soon

Advertisement

Samantha : స‌మంత డ్యాన్స్ ర‌చ్చ‌..

ఇందులో స‌మంత త‌న స్టెప్స్ తో ఓ ఊపు ఊప‌నుంద‌ని టాక్. ప్ర‌స్తుతం దీనికి సంబంధించి సినీ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. కాగా, శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాక‌పోవ‌టంతో సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయ‌బోతున్నారు మేక‌ర్స్‌. హ‌రి హ‌రీష్ అనే ద‌ర్శ‌క ద్వ‌యం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దీని త‌ర్వాత డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌లోనూ స‌మంత ఓ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి