Sirivennela : సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని సినిమా పాటలను ఊహించలేం.. మహేశ్ బాబు ఎమోషనల్..
Sirivennela : ఎన్నో హిట్ పాటలను అందించిన తెలుగు సినిమా సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి నిన్న కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి అనేక మంది తెలుగు స్టార్ హీరోలు మరియు అనేక మంది దర్శకులు, ఆర్టిస్టులు నివాళులు అర్పించారు. ఇక ఆయనకు నివాళి అర్పించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ సిరి వెన్నెల గారిని కోల్పోవడం చాలా బాధాకరమని ఇది తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు.
మ్యూజిక్ కు సీతారామ శాస్త్రి గారు ఎంతో చేశారని మహేశ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా తెలుగు సినీ పరిశ్రమ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 లకు పైచిలుకు తెలుగు పాటలకు సాహిత్యం అందించారు.
Sirivennela : 3వేల పైచిలుకు పాటలు రాసిన శాస్త్రి..
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరికీ ఆయన పాటలు రాశారు. అసలు సినిమానే ఆయన తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన పాటలు రాసిన సిరివెన్నెల సినిమా పేరునే తన పేరుకు ముందు పెట్టుకున్నారు. చాలా మంది సినీ తారలు ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సిరి వెన్నెల ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ కన్నుమూశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సొంతూరు ఆంధ్రప్రదేశ్ లో ని అనకాపల్లి. ఆయన 1955లో జన్మించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన తన పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను – మహేష్ బాబు pic.twitter.com/h8Psl7kWcD
— Sakshi TV (@SakshiHDTV) December 1, 2021