Tollywood : టాలీవుడ్ సినిమాల మీద కరోనా ఎఫెక్ట్ ..వరసగా వాయిదా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood : టాలీవుడ్ సినిమాల మీద కరోనా ఎఫెక్ట్ ..వరసగా వాయిదా..!

 Authored By govind | The Telugu News | Updated on :9 May 2021,4:30 pm

Tollywood : టాలీవుడ్ సినిమాల మీద కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. అన్నీ ఇండస్ట్రీలతో పాటు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీస్‌కి పెద్ద దెబ్బ పడుతోంది. గత ఏడాదే వందల కోట్లలో నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆ నష్టాలు ఈ ఏడాది కూడా తప్పడం లేదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కారణం కరోనా సెకండ్ వేవ్. నిర్మాతలకి కరోనా సెకండ్ వేవ్ హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది. ఎన్నో ఆశలతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్ని తారుమారయ్యాయి.

carona effect on tollywood movies

carona-effect-on-tollywood-movies

కరోనా దెబ్బ సినిమా ఇండస్ట్రీకి కోలుకోని విధంగా తగులుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయి నిర్మాతలకి బాగానే ఆర్ధిక నష్టం జరిగింది. ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేయాలంటే పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మించే సినిమాలను పూర్తి చేయలేక మధ్యలో వదిలేయలేక ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఊహించుకోవచ్చు. సంక్రాంతికి వచ్చిన క్రాక్ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ సంబర పడ్డారు. కానీ సీన్ మళ్ళీ రివర్స్ అయింది. షెడ్యూల్ చేసుకున్న సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్ళీ వందల కోట్లలో నష్టం తప్పదంటున్నారు.

అయితే ఇప్పటికే పోస్ట్ పోన్ చేసిన సినిమాలను మళ్ళీ మంచి రిలీజ్ డేట్ కి రీ షెడ్యూల్ చేయడం అంటే అంత సులభంగా అయ్యే పని కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మీడియం బడ్జెట్ సినిమాలు లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం సినిమాలు పోస్ట్ పోన్ చేయగా మే లో రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ ఆచార్య, వెంకటేష్ నటించిన నారప్ప కూడా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశారు. ఇవే కాదు రాధే శ్యామ్, కేజీఎఫ్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సహా దాదాపు అన్నీ సినిమాలు పోస్ట్ పోన్ అవడం ఖాయంటున్నారు. మళ్ళీ ఇండస్ట్రీకి వందల కోట్లలో నష్టం తప్పదంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది