Hansika Motwani : క్యాస్టింగ్ కౌచ్ అదంతా అబద్ధం.. వివరణ ఇచ్చిన హన్సిక..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hansika Motwani : క్యాస్టింగ్ కౌచ్ అదంతా అబద్ధం.. వివరణ ఇచ్చిన హన్సిక..!!

Hansika Motwani : దక్షిణాది సినిమా రంగంలో గుర్తింపు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్స్ ఒక స్టేజ్ వచ్చాక బాలీవుడ్ కి వెళ్లిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో లైఫ్ ఇచ్చిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై అనరాని మాటలనేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. దక్షిణాది సినిమా రంగాన్ని తక్కువ చేసి మాట్లాడి బాలీవుడ్ ఇండస్ట్రీల అవకాశాలు అందుకోవటం కోసం… దిగజారిన హీరోయిన్స్ ఎక్కువే. సరిగ్గా ఈ కోవాలోనే హన్సిక కూడా చేరినట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :26 May 2023,7:00 pm

Hansika Motwani : దక్షిణాది సినిమా రంగంలో గుర్తింపు సంపాదించుకున్న చాలామంది హీరోయిన్స్ ఒక స్టేజ్ వచ్చాక బాలీవుడ్ కి వెళ్లిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో లైఫ్ ఇచ్చిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై అనరాని మాటలనేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. దక్షిణాది సినిమా రంగాన్ని తక్కువ చేసి మాట్లాడి బాలీవుడ్ ఇండస్ట్రీల అవకాశాలు అందుకోవటం కోసం… దిగజారిన హీరోయిన్స్ ఎక్కువే. సరిగ్గా ఈ కోవాలోనే హన్సిక కూడా చేరినట్లు ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. మేటర్ లోకి వెళ్తే హన్సిక బాలునిటిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభించింది.

casting couch is all a lie Hansika Motwani explained

casting couch is all a lie Hansika Motwani explained

టీనేజ్ వయసులో “దేశముదురు”తో తెలుగులో ఫస్ట్ టైం హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తాను హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఓ యువ నటుడు తనతో కొంచెం అతిగా ప్రవర్తించినట్టుగా ఇలా తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పినట్లు వార్తలు ఇటీవల ప్రచురితమయ్యాయి. దీంతో ఈ వార్తలపై హన్సిక తీవ్రంగా స్పందించింది. తాను చెప్పని విషయాలు చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడుతోంది.

కాస్టింగ్ కౌచ్.. నేన‌లా అన‌లేదు: హ‌న్సిక!

బాలీవుడ్ బాలనాటిగా కెరియర్ ప్రారంభించిన హన్సిక… తెలుగులో “దేశముదురు” తో ఫస్ట్ అందుకుని అనేక అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత తమిళంలో తెలుగు కంటే మరింత క్రేజ్ సంపాదించుకొని పోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. తమిళంలో స్టార్ గా ఎదిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో 50 కి పైగా సినిమాలను పూర్తి చేసుకుని ఇటీవలే పెళ్లి చేసుకుంది. హన్సిక పెళ్లి కథను ప్రముఖ ఓటిటి సంస్థ వెబ్ సిరీస్ గా ప్రసారం చేసింది. దీనికిగాను హన్సిక మంచి అమౌంట్ పొందిందని వినికిడి. ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్ వేధింపుల విషయంలో తనపై అబద్దాల ప్రచారం జరుగుతుందని హన్సిక ఖండించింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది