Hansika Motwani : ఐలవ్యూ సురేశ్.. అందరి ముందే ప్రపోజ్ చేసిన హన్సిక.. బుద్ధి ఉందా నీకు అంటూ డైరెక్టర్ వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hansika Motwani : ఐలవ్యూ సురేశ్.. అందరి ముందే ప్రపోజ్ చేసిన హన్సిక.. బుద్ధి ఉందా నీకు అంటూ డైరెక్టర్ వార్నింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :4 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  మై నేమ్ ఈజ్ శృతి మూవీ కాన్సెప్ట్ ఏంటి?

  •  స్కిన్ తోనూ బిజినెస్ నిజంగానే చేస్తారా?

  •  ఆసక్తికరంగా మై నేజ్ ఈజ్ శృతి ట్రైలర్

Hansika Motwani : టాలీవుడ్ నటి హన్సిక మోత్వాని తెలుసు కదా. తనకు పెళ్లి అయినా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తాజాగా తను మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో మూవీ టీమ్ పాల్గొన్నది. మీడియా మీట్ నిర్వహించింది. ఈసందర్భంగా మరోసారి సురేశ్ కొండేటి రెచ్చిపోయాడు. హన్సికను ఇష్టం ఉన్నట్టుగా ప్రశ్నలు అడిగాడు. నీకు పెళ్లయింది కదా.. ఇంకా సినిమాలు చేస్తారా? అంటూ అడిగాడు. అలాగే.. నీ స్కిన్ ఎందుకు ఇంత ప్రకాశంగా ఉంది. మీరు పెళ్లయినా ఇంత అందంగా ఉన్నారు అంటే హన్సిక పొంగిపోయింది. వెంటనే ఐలవ్యూ అంటూ చెప్పేసింది హన్సిక. కానీ.. హన్సిక ఏదో మీడియా ముందు అలా మాట్లాడినట్టు తెలుస్తోంది. కానీ.. ఇన్ డైరెక్ట్ గా సురేశ్ కొండేటిని తిట్టినట్టుగా అనిపిస్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ శృతి అని పేరెందుకు పెట్టారు అంటూ పిచ్చి ప్రశ్నలు అడిగాడు సురేశ్. దీంతో డైరెక్టర్ కు కోపం వచ్చింది. అడగాల్సిన ప్రశ్నలు కాకుండా సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నాడంటూ కోపం ప్రదర్శించాడు. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి కూడా చాలా ఏళ్లు అవుతోంది. అయినా కూడా ఇంకా 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్నావు. నీ సీక్రెట్ ఏంటి.. ఇంత యంగ్ గా ఎలా ఉన్నావు అంటూ సురేశ్ ప్రశ్నించాడు. దీంతో ఐలవ్యూ. నన్ను పొగిడావు కదా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చింది హన్సిక. నాకు పెళ్లి అయినా.. పెళ్లి కాకపోయినా.. తల్లిని అయినా ఏదైనా.. నేను నాకు ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తాను అంటూ హన్సిక చెప్పుకొచ్చింది.

Hansika Motwani : హన్సిక అందుకే ఈ సినిమాను ఒప్పుకుంది

హన్సిక ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం.. కథలో ఉన్న దమ్ము. ప్రతి రోజు చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ప్రతి నిమిషానికి ఇండియాలో 10 మంది అమ్మాయిలు ట్రాప్ అవుతున్నారు. వీళ్లంతా ఏమౌతున్నారు అనేదానికి చాలామంది దగ్గర ఉండే సమాధానాలు కొన్ని మాత్రమే. మనకు తెలియని కోణాలు చాలా ఉన్నాయి. అమ్మాయిలను స్కిన్ కోసం ఎత్తుకెళ్తున్నారు. దాని ఆధారంగానే ఈ సినిమాను తీశాను అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.

https://www.youtube.com/watch?v=b504fajiww0

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది