Chalaki Chanti : సింగర్ మనో కంటే సంగీత బెటరా?.. జబర్దస్త్ జడ్జ్ మారడంపై చలాకీ చంటి కామెంట్లు

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 9:20 pm

Chalaki Chanti : జబర్దస్త్ షోలో ఈ మధ్య ఏదీ నిలకడగా ఉండటం లేదు. యాంకర్ మారిపోయింది. జడ్జ్ మారిపోయింది. రోజా స్థానంలో ఇంద్రజ వచ్చింది. మనో ఉన్నాడో లేడో అర్థం కావడం లేదు. మధ్య మధ్యలో వస్తున్నాడు వెళ్తున్నాడు. ఆయనకు రీప్లేస్‌గా ఎంతో మందిని చూస్తున్నారు. ఎంతో మంది సీనియర్ హీరోయిన్లను తీసుకొచ్చి ఇంద్రజ పక్కన పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ శాశ్వతంగా ఉండటం లేదు. అందరూ రెండు మూడు ఎపిసోడ్‌లకు పరిమితమవుతున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒకరిని పట్టుకొచ్చారు. అప్పుడెప్పుడో వచ్చిన సంగీత మళ్లీ జబర్దస్త్ జడ్జ్ సీటులో కూర్చుంది. గతంలోనూ రెండు మూడు సార్లు ఆ కుర్చీలో కూర్చుంది.

ఇక ఇప్పుడు మళ్లీ ఆమెను పట్టుకొచ్చారు. గత రెండు వారాల క్రితం ఇలానే కుష్బూని పట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈమెను తీసుకొచ్చారు. సంగీతకు ఇది అలవాటైన కుర్చీనే. ఇది వరకు చూసిన షోనే. అయితే చలాకీ చంటి మాత్రం సంగీతను పొగడాల్సిన స్థితిలో మనోని కించపరిచినట్టు అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన జడ్జ్‌ను కీర్తించడం అక్కడ పరిపాటిగానే మారింది. ఈ క్రమంలోనే చంటి కాస్త తన భక్తిభావాన్ని చూపించాడు. జడ్జ్లో ఏంటి మనో గారు కనిపించడం లేదని ఒకడు అంటే.. పాటలు పాడే సింగర్ మనో కంటే.. ఆయన నేర్చుకున్న సంగీతాన్నే ఇక్కడకు తీసుకొచ్చారు అంటూ ఇలా సంగీతను ఆకాశంలోకి ఎత్తేశాడు.

Chalaki Chanti Sangeetha Who Replaces Singer Mano in Jabardasth Show

Chalaki Chanti Sangeetha Who Replaces Singer Mano in Jabardasth Show

దీంతో సంగీత ఉబ్బితబ్బిబ్బైపోయింది. మొత్తానికి ఈ ప్రోమోలోనే కొత్త యాంకర్‌ గురించి ఇంట్రోడక్షన్ ఇచ్చారు. కానీ ఆమెను మాత్రం చూపించలేదు. అదో సర్ ప్రైజ్‌గా అందరూ ప్లాన్ చేసినట్టున్నారు. ఇక కొత్త యాంకర్ కోసం పల్లకిని కూడా ఏర్పాటు చేశారు.. ఆ యాంకర్ ఎవరు? ఆమె అయినా ఎన్నాళ్లు ఉంటుంది? లేదా రష్మీనే మళ్లీ జబర్దస్త్ షోకు యాంకర్‌గా పెట్టుకున్నారా? ఈ సంగీత ఎన్ని రోజులు ఉంటుంది.. రెండు మూడు ఎపిసోడ్లేనా? అన్నది తెలియాలంటే ఓ రెండు మూడు వారాల ఎపిసోడ్‌లు చూడాల్సిందే.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp