Chalapathi Rao : ఓరి నాయనో .. చలపతిరావు చనిపోవడానికి కారణం ఇదా ?? ఇన్నాళ్ళకి బయటపడింది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chalapathi Rao : ఓరి నాయనో .. చలపతిరావు చనిపోవడానికి కారణం ఇదా ?? ఇన్నాళ్ళకి బయటపడింది…!!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 December 2022,5:20 pm

Chalapathi Rao : సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు ఎన్నో సినిమాల‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అల‌రించిన విష‌యం తెలిసిందే. సినీ రంగంలోకి ప్రవేశించకముందే, ప్రేమ వివాహం చేసుకున్న అత‌ను తనకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికే తన భార్య కన్నుమూసింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలు పుట్ట‌గా, భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన వచ్చిందని, అయితే, తన పిల్లలు కళ్లెదుటే ఉండటంతో ఆ ఆలోచనను పక్కన పెట్టానని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు చ‌ల‌ప‌తిరావు. అయితే గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న

చ‌ల‌ప‌తిరావు రీసెంట్‌గా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. డిసెంబ‌ర్ 25న త‌న‌ స్వగృహంలో గుండెపోటు కారణంగా చ‌ల‌ప‌తి రావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఆయన ఇంటికే పరిమితం కాగా, హఠాత్తుగా గుండెపోటుతో మరణించటం అందరినీ కలచి వేస్తోంది. అయితే, గతంలో చోటుచేసుకున్న ఓ ప్రమాదం కారణంగా చాలా ఏళ్ల నుంచి చలపతి రావు బాధపడుతున్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 2018 టైంలో హీరో అల్లరి నరేష్‌ హీరోగా తెర‌కెక్కిన చిత్రంలో చ‌ల‌ప‌తి రావు ముఖ్య పాత్ర పోషించారు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి

Chalapathi Rao death reason

Chalapathi Rao death reason

Chalapathi Rao : ఇదేనా అస‌లు కార‌ణం..

కిందపడిపోవ‌డంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తర్వాతినుంచి చ‌ల‌ప‌తిరావు ఆరోగ్యంలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లకు కొంచెం కొంచెంగా దూరం ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం చ‌ల‌ప‌తిరావు ఆరోగ్యంపై బాగా ప‌డింద‌ని ఆయ‌న మృతికి ఇది కూడా కార‌ణం అయి ఉండొచ్చ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన ‘రారాండోయ్ వేడుక చూద్దాం’ ఈవెంట్ లో చలపతిరావు చేసిన వ్యాఖ్య‌లు వివాదం కాగా, అప్ప‌టి నుండి సినిమా ఫంక్షన్ లకు కూడా దూరమయ్యారు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది