Chalapathi Rao : ఎంతో ఆరోగ్యంతో ఉన్న చ‌ల‌ప‌తి రావు ఇలా ఆక‌స్మిక మ‌ర‌ణం పొంద‌డం వెన‌క కారణం..?

Authored By Sam C | The Telugu News | Published on: December 25, 2022, 4:00 pm

Chalapathi Rao : న‌వ‌ర‌స న‌ట సౌర్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ రావు ఆక‌స్మిక మ‌ర‌ణం జీర్ణించుకోక‌ముందే ఇండ‌స్ట్రీలో మ‌రో విషాద వార్త అంద‌రి మ‌న‌సుల‌ని కొల్ల‌గొట్టింది. ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రించిన చ‌ల‌ప‌తి రావు గుండెపోటుతో ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సుమారు 1200 కి పైగా సినిమాల్లో, మూడు తరాలకు చెందిన కథా నాయకులతో కలిసి నటించిన చలపతిరావు ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్లతో పరిచయం అయి ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్రల్లోనూ నటించి వైవిధ్యం చాటారు. తండ్రి, బాబాయి, మామయ్య, విలన్, సైడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ న‌టించి మెప్పించిన చ‌ల‌పతి రావు ‘గూఢచారి 116’ ఆయన మొదటి సినిమా. 2021లో నాగార్జునతో కలసి నటించిన బంగార్రాజు ఆయన చివరి సినిమా అని చెప్పాలి. చ‌ల‌ప‌తి రావు త‌న జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ని ఎదుర్కొన్నాడు.

2018 టైంలో హీరో అల్లరి నరేష్‌ హీరోగా ఓ సినిమా చేయ‌గా, ఇందులో ఓ షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోయారు. దీంతో ఆయనకు గాయాల పాలు కాగా, చిత్ర బృందం వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాతినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు రాగా, కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. అలా ఇటీవ‌ల సినిమాల‌లో చాలా త‌క్కువ‌గా కనిపించిన చ‌ల‌ప‌తి రావు ఇలా క‌న్నుమూయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. చ‌ల‌ప‌తి రావు గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్టు చెబుతుండ‌గా, 2018 టైంలో హీరో అల్లరి నరేష్‌ హీరోగా తెర‌కెక్కిన‌ సినిమా వ‌లన ఆయ‌న మ‌ర‌ణించారని కొంద‌రు చెబుతున్నారు.

Chalapathi Rao death news viral

Chalapathi Rao death news viral

Chalapathi Rao : ఏంటి కార‌ణం..?

ఈ సినిమా షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోగా, తీవ్ర గాయాలు కాగా చిత్ర బృందం వెంట‌నే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకుంటుండ‌గా, ఈ కార‌ణం వ‌ల‌నే సినిమా షూటింగ్స్ కి దూరం అయ్యారు. అయితే ఆయన ఇప్పుడు ఆక‌స్మాత్తుగా మ‌ర‌ణించ‌డం ఎవ‌రికి జీర్ణం కావ‌డం లేదు. బంగార్రాజు సినిమాలో చలపాయ్ అంటూ నాగర్జున చేత పిలిపించుకున్నా, బాలకృష్ణ చేత సత్తిరెడ్డీ అంటూ పిలిపించుకున్నా.. ఆది సినిమా యన్టీఆర్ కేర్ టేకర్‌గా నటించినా… సై సినిమాలో నితిన్ తండ్రిగా జీవించినా.. అల్లరి నరేశ్ తో కలసి కామెడీ చేసినా..ప్ర‌తి పాత్ర‌లోను త‌న ప్ర‌త్యేక‌త చాటుకున్నారు చ‌ల‌ప‌తి రావు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp