Chalapathi Rao : చలపతి రావు జీవితమంతా విషాదాలే.. అప్పుడే సూసైడ్ చేసుకోవాలనుకున్నా..?
Chalapathi Rao : టాలీవుడ్,Tollywood, సీనియర్ నటుడు చలపతిరావు 78 ఏళ్ల వయస్సులో డిసెంబర్ 25 ఉదయం గుండెపోటుతో చనిపోయారు. ఇండస్ట్రీలో పాత తరం నటుల్లో ఒకరిగా ఉన్న చలపతిరావు సుమారు 1200కి పైగా సినిమాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించి మెప్పించారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. చలపతిరావు 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతని భార్య చనిపోగా, అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకోమని చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చిన కూడా చలపతిరావు పెళ్లి జోలికి వెళ్లలేదు. ఒకానొక సమయంలో పేదరికంతో అలమిటిస్తున్న తాను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట.
కాని తాను చనిపోతే పిల్లల భవిష్యత్ ఏంటా అని ఆలోచనని విరమించుకున్నాడట. చీరకు నిప్పంటుకిని తన భార్య చనిపోగానే రెండో పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ వచ్చే ఆవిడ.. తన ముగ్గురు పిల్లలను సరిగా చూసుకుంటుందో లేదో అనే సందేహంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఈ సీనియర్ నటుడి జీవితంలో అనేక విషాద సంఘటనలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. చలపతి రావు భార్య మరణించే సమయానికి రవిబాబు వయసు ఏడేళ్లు కాగా, చాలా మంది ఆయనను రెండో పెళ్లికి ప్రోత్సహించారు. అయినప్పటికీ ససేమిరా ఒప్పుకోలేదట. ఇక సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయిన చలపతి రావు దాదాపు 8 నెలలపాటు చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు.
Chalapathi Rao : ఎన్నో విషాదాలు..!!
ఆ సమయంలోనే కంటి చూపు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడగా,. బోయపాటి శ్రీను ఆయనను చక్రాల కుర్చీలో ఉండగానే బ్యాంకాక్ తీసుకువెళ్లి షూటింగ్ చేయించారు. అతని టాలెంట్‌కి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. అప్పట్లో చలపతి రావు ఒక ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయగా, ఆ సమయంలో చలపతిరావుని దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు మరోసారి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట. కాని కుమారుడి మాటలతో, మోటివేషన్తో డిప్రెషన్ నుండి బయటపడ్డారు. 1994 మే 8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు ఇండస్ట్రీలో దాదాపుగా 1200 కు పైగా చిత్రాల్లో నటించారు. మొదటిసారి ఆయన నటించిన చిత్రం గూడచారి 116 కాగా, చివరిసారి నటించిన చిత్రం ఓ మనిషి నీవెవరు.