Chandini Chowdary : బాత్ రూమ్ కోసం గంట‌ల పాటు వెయిట్ చేశా.. ఆ విష‌యం గురించి చెప్పిన హీరోయిన్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandini Chowdary : బాత్ రూమ్ కోసం గంట‌ల పాటు వెయిట్ చేశా.. ఆ విష‌యం గురించి చెప్పిన హీరోయిన్‌

Chandini Chowdary : ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మ‌లు త‌మ జీవితంలో ఎదుర్కొన్న విచిత్ర ప‌రిస్థితుల గురించి చెబుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. పేరుకి తెలుగమ్మాయే కానీ సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు అందుకున్న చాందిని చౌదరి కూడా తాను కాలేజ్ రోజుల్లో ఎదుర్కొన్న విచిత్ర ప‌రిస్థితుల గురించి చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచింది. చాందినికి మంచి టాలెంట్ ఉన్నా కూడా స‌రైన అవ‌కాశాలు దొర‌క‌డం లేదు. గామికి ఎన్ని ప్రశంసలు వచ్చినా […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,8:00 pm

Chandini Chowdary : ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మ‌లు త‌మ జీవితంలో ఎదుర్కొన్న విచిత్ర ప‌రిస్థితుల గురించి చెబుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. పేరుకి తెలుగమ్మాయే కానీ సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు అందుకున్న చాందిని చౌదరి కూడా తాను కాలేజ్ రోజుల్లో ఎదుర్కొన్న విచిత్ర ప‌రిస్థితుల గురించి చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచింది. చాందినికి మంచి టాలెంట్ ఉన్నా కూడా స‌రైన అవ‌కాశాలు దొర‌క‌డం లేదు. గామికి ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి అధిక శాతం విశ్వక్ సేన్ అకౌంట్ లోకి వెళ్లిపోయాయి. బాలకృష్ణ 109లో అవకాశం దక్కించుకున్నా అందులో మెయిన్ హీరోయిన్ వేరే కావ‌డంతో ఈ అమ్మ‌డి పేరు ఎక్కువ‌గా వినిపించ‌డం లేదు…

Chandini Chowdary అదొక న‌ర‌కం..

ఈ విశాఖ బ్యూటీ.. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో మొదలైన ఆమె సినీ ప్రయాణం యేవమ్ వరకూ వచ్చింది. ఈమె నటించిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలు ఒకేరోజు అంటే ఈ శుక్రవారం (జూన్ 14) థియేటర్స్‌లో విడుదల కానున్నాయి. యేవమ్ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది చాందినీ చౌదరి. తాజాగా చాందిని చౌదరి దావత్‌ టాక్‌ షోలో పాల్గొంది. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ రీతూ చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఇది. ఇందులో బో.. గా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంటారు. అందులో భాగంగా చాందిని చౌదరి తాను ఇంటర్మీడియట్‌ లో చేసిన తప్పుని వెల్లడించింది.

Chandini Chowdary బాత్ రూమ్ కోసం గంట‌ల పాటు వెయిట్ చేశా ఆ విష‌యం గురించి చెప్పిన హీరోయిన్‌

Chandini Chowdary : బాత్ రూమ్ కోసం గంట‌ల పాటు వెయిట్ చేశా.. ఆ విష‌యం గురించి చెప్పిన హీరోయిన్‌

ఈ క్రమంలో శ్రీ చైతన్య కాలేజీ బాగోతం బయటపెట్టింది. అందులో ఉన్నప్పుడు ఎంత నరకం అనుభవించిందో చెప్పింది చాందిని. బాగా చదవాలని, దుమ్ములేపాలని విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో చేరిందట. కానీ ఆ హాస్టల్‌కి వెళ్లాక తెలిసింది అసలు నరకం అంటే ఏంటో, అందరికి కంబైన్డ్ బాత్‌రూమ్‌లు ఉంటాయట. బాత్‌ రూమ్‌కి వెళ్లాలంటే మార్నింగ్ గంటన్నర ముందు లేచి బకెట్లు పట్టుకుని లైన్‌లో గంటల తరబడి వెయిట్‌ చేయాలట. మార్నింగ్‌ ఆరు గంటలకే క్లాస్‌లు స్టార్ట్ అవుతాయని, ఫుడ్‌ ఉండదు, ఏముండదు, రెండు క్లాస్‌ లు అవుతాయి, అవి అయ్యాక వెళ్లి స్నానం చేసి పడుకోవడం, రోజూ మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్ర. అబ్బో అదో నరకం అందుకే మూడు నెలల్లోనే ఇంటికి తిరిగొచ్చాను అని తెలిపింది చాందిని చౌదరి. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. అవన్నీ కుదరాలి అని, లవ్‌ మ్యారేజ్‌ అయినా, అరెంజ్‌ మ్యారేజ్‌ అయినా ఓకే అని చెప్పింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది