Actress : గెస్ట్ హౌజ్‌కి రాక‌పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ హీరోయిన్‌కి బెదిరింపులు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Actress : గెస్ట్ హౌజ్‌కి రాక‌పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ హీరోయిన్‌కి బెదిరింపులు..!

Actress : సినీ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఏ ర‌కంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే చెప్పుకొచ్చారు. సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌తో పాటు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది భామ‌లు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి బ‌హిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే తాజాగా కలర్ ఫొటో ఫేం చాందిని చౌదరి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2024,3:56 pm

ప్రధానాంశాలు:

  •  Actress : గెస్ట్ హౌజ్‌కి రాక‌పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ హీరోయిన్‌కి బెదిరింపులు..!

Actress : సినీ ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఏ ర‌కంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే చెప్పుకొచ్చారు. సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌తో పాటు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న చాలా మంది భామ‌లు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి బ‌హిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే తాజాగా కలర్ ఫొటో ఫేం చాందిని చౌదరి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా వచ్చిన చాందిని కేటుగాడు సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది.

Actress  నువ్వు గెస్ట్ హౌస్‌కు రావాలి

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది . సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇక రీసెంట్‌గా గామి అనే చిత్రంతో కూడా ప‌ల‌క‌రించింది. అయితే ఈ భామ తాజాగా త‌న జీవితంలో ఎదురైన విచిత్ర ప‌రిస్థితుల గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. చాందిని చౌదరికి ఒకరోజు కొత్త నెంబర్ నుంచి మెసేజ్ రాగా, అందులో గెస్ట్ హౌస్‌కు రావాలని.. లేకుంటే తన ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారట. అది చూసి చాందిని చాలా ఏడ్చేసింద‌ట‌.

Actress గెస్ట్ హౌజ్‌కి రాక‌పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ హీరోయిన్‌కి బెదిరింపులు

Actress : గెస్ట్ హౌజ్‌కి రాక‌పోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేస్తానంటూ హీరోయిన్‌కి బెదిరింపులు..!

ఆ త‌ర్వాత కాస్త ధైర్యం చేసి ఇండస్ట్రీలో తన స్నేహితులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వాళ్ళు మొదట ఆ నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడితే ఆ మేసేజ్ చేసింది ఎవరో తెలిస్తుందని సలహా ఇవ్వడంతో .. ఆ నెంబర్‌కు కాల్ చేయగా..ఓ లేడీ లిఫ్ట్ చేసి మాట్లాడటంతో చాందిని కంగుతిందట. చాందిని ఏడుపు చూసిన.. టాలీవుడ్ టామ్ బాయ్ నటి స్నిగ్ధ వెంటనే స్పందించి.. నీపై ప్రాంక్ చేసింది నేనేనని చెప్పిందట. నేనే కావాలని, ఆట పట్టించాలని ఇలా చేశానని చెప్పగా.. ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అంటూ అడిగిందట. ప్లేస్ చెబితే వెళ్లి చెంప ప‌గ‌ల‌గొట్టింద‌ట‌. ఇది జ‌రిగి చాలా రోజులే అవుతున్నా కూడా రీసెంట్‌గా ఈ విష‌యాన్ని స్నిగ్ధ చెప్ప‌డంతో ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది