Chandini Chowdary : బాత్ రూమ్ కోసం గంటల పాటు వెయిట్ చేశా.. ఆ విషయం గురించి చెప్పిన హీరోయిన్
Chandini Chowdary : ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు తమ జీవితంలో ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. పేరుకి తెలుగమ్మాయే కానీ సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు అందుకున్న చాందిని చౌదరి కూడా తాను కాలేజ్ రోజుల్లో ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరచింది. చాందినికి మంచి టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశాలు దొరకడం లేదు. గామికి ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి అధిక శాతం విశ్వక్ సేన్ అకౌంట్ లోకి వెళ్లిపోయాయి. బాలకృష్ణ 109లో అవకాశం దక్కించుకున్నా అందులో మెయిన్ హీరోయిన్ వేరే కావడంతో ఈ అమ్మడి పేరు ఎక్కువగా వినిపించడం లేదు…
ఈ విశాఖ బ్యూటీ.. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో మొదలైన ఆమె సినీ ప్రయాణం యేవమ్ వరకూ వచ్చింది. ఈమె నటించిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలు ఒకేరోజు అంటే ఈ శుక్రవారం (జూన్ 14) థియేటర్స్‌లో విడుదల కానున్నాయి. యేవమ్ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది చాందినీ చౌదరి. తాజాగా చాందిని చౌదరి దావత్ టాక్ షోలో పాల్గొంది. సోషల్ మీడియా సెన్సేషన్ రీతూ చౌదరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఇది. ఇందులో బో.. గా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంటారు. అందులో భాగంగా చాందిని చౌదరి తాను ఇంటర్మీడియట్ లో చేసిన తప్పుని వెల్లడించింది.
Chandini Chowdary : బాత్ రూమ్ కోసం గంటల పాటు వెయిట్ చేశా.. ఆ విషయం గురించి చెప్పిన హీరోయిన్
ఈ క్రమంలో శ్రీ చైతన్య కాలేజీ బాగోతం బయటపెట్టింది. అందులో ఉన్నప్పుడు ఎంత నరకం అనుభవించిందో చెప్పింది చాందిని. బాగా చదవాలని, దుమ్ములేపాలని విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీలో చేరిందట. కానీ ఆ హాస్టల్‌కి వెళ్లాక తెలిసింది అసలు నరకం అంటే ఏంటో, అందరికి కంబైన్డ్ బాత్‌రూమ్‌లు ఉంటాయట. బాత్ రూమ్‌కి వెళ్లాలంటే మార్నింగ్ గంటన్నర ముందు లేచి బకెట్లు పట్టుకుని లైన్‌లో గంటల తరబడి వెయిట్ చేయాలట. మార్నింగ్ ఆరు గంటలకే క్లాస్‌లు స్టార్ట్ అవుతాయని, ఫుడ్ ఉండదు, ఏముండదు, రెండు క్లాస్ లు అవుతాయి, అవి అయ్యాక వెళ్లి స్నానం చేసి పడుకోవడం, రోజూ మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్ర. అబ్బో అదో నరకం అందుకే మూడు నెలల్లోనే ఇంటికి తిరిగొచ్చాను అని తెలిపింది చాందిని చౌదరి. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. అవన్నీ కుదరాలి అని, లవ్ మ్యారేజ్ అయినా, అరెంజ్ మ్యారేజ్ అయినా ఓకే అని చెప్పింది
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
This website uses cookies.