Chandramukhi Story : చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandramukhi Story : చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?

Chandramukhi Story : చంద్రముఖి ఈ పేరు తెలియని వారు ఉండరు కానీ సినిమాలో చంద్రముఖి గురించి తెలుసుకొని గోరంత మాత్రమే.. ఈమె గురించి మన ఎవ్వరికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.. చంద్రముఖి స్టోరీ : ఈ కథను రాసింది మధుముత్తం గారు ఇతను కేరళలోని అల్లపుజా అనే ప్రాంతంలో నివసిస్తూవుంటారు. వీరి ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా వుండేది. ఒకప్పుడు దీనిలో ఒక ధనవంతుడు వుండేవాడు. మధు […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 August 2022,9:00 pm

Chandramukhi Story : చంద్రముఖి ఈ పేరు తెలియని వారు ఉండరు కానీ సినిమాలో చంద్రముఖి గురించి తెలుసుకొని గోరంత మాత్రమే.. ఈమె గురించి మన ఎవ్వరికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.. చంద్రముఖి స్టోరీ : ఈ కథను రాసింది మధుముత్తం గారు ఇతను కేరళలోని అల్లపుజా అనే ప్రాంతంలో నివసిస్తూవుంటారు. వీరి ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లా వుండేది. ఒకప్పుడు దీనిలో ఒక ధనవంతుడు వుండేవాడు. మధు ముత్తం గారి ఇంటికి కాస్త దూరంలోనే ఈ బంగ్లా వుంటుంది. ఈ బంగ్లా గురించి తెలుసుకొనుటకు అసలు ఈ బంగ్లాలో ఇంతకు ముందు ఎవరు వుండేవారు అసలు దీని చరిత్ర ఏమిటి అని ప్రక్కన ఉన్న నివశించే వారిని అడిగి తెలుసుకున్నారు, దాన్ని బట్టే చంద్రముఖి కథ రాయడం జరిగింది. అసలు కథ ఏమిటంటే ఆ బంగ్లా పేరు ఆల్ ముట్టిల్ మేడ ఇది కేరళ రాష్ట్రంలోని అల్లపూజ జిల్లాలోని నంగి యార్క్ లంగరా మా వెల్క రా రోడ్ కి ప్రక్కన ఉంది. కేరళ ప్రాంతంలో దీన్ని ఒక సంప్రదాయ ఇల్లు దీన్ని మొత్తం చెక్కతో నిర్మించి ఉంటుంది.

దీని యొక్క ఓనర్ కరనోవర్. కరానోవర్ అనగా కుటుంబ పెద్ద అని అర్దం. ఈ కారనోవర్ చాలా ధనవంతుడు. పెళ్లి అయిన ఒక సంవత్సరానికే భార్య చనిపోయింది పిల్లలు కూడా లేరు. కేరళ మొత్తాన్ని అప్పటి ట్రావెల్ కోర్ రాజులు పాలిస్తున్నారు. వీరి పాలనలో కేరళ ఎంతో అభివృద్ధి చెందినది, అప్పటిలో కేరళ మొత్తం మీద 3 లేదా 4 కార్లు మాత్రమే ఉండేవి.వాటిలో ఒకటి ట్రావెల్ కోర్ రాజుది మరొకటి కరనోవర్ మహారాజు ది కూడా కారు ఉంది అంటే అతను ఎంత ధనవంతుడో అర్దం చేసుకోవచ్చు అప్పటిలో కుల వ్యవస్థ బాగా ఉండేది కానీ కరనోవర్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండే సరికి అందరు అతన్ని గౌరవించేవారు. అదే విధంగా చుట్టు ప్రక్కల ఉన్న వారు కూడా ఆర్థిక సహాయం కోసం కరనోవర్ దగ్గరకు వచ్చేవారు. అలా ఆర్థిక సహాయం మాత్రమే కాక అన్నదానం కూడా పెట్టి పంపేవారు. ఇంకా కరనోవర్ తో పాటు తన అక్క చెల్లెళ్ళు, బావ బమ్మర్దిలు వారి కుటుంబం వాళ్ళు కూడా అక్కడే వుండేవారు అలాగే ఈ మెడలో పనిచేసే పనివారి కోసం ఇళ్లను కూడా నిర్మించారు.ఆ మేడలో ఉంటున్న కరనోవర్ చుట్టాలు కరనోవర్ తదనంతరం వారసులు కూడా లేరు కాబట్టి వారు బయటకు ప్రేమను నటించేవారు.

Chandramukhi Real Story Lot Of Difference bw Movie and True

Chandramukhi Real Story Lot Of Difference bw Movie and True

కరనోవర్ ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు తన భవనంలో పనిచేయుడానికి ఒక ఆమెను తీసుకొస్తాడు.అసలు ఆమెకు ఇక్కడకు రావడం ఇష్టం లేదు కానీ పెద్దవారు కనుక తప్పక వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి కరనోవర్ అన్ని పనులు ఆమె దగ్గర ఉండి చూసుకొనేది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలా వారి మధ్య మెల్ల మెల్లగా బంధం ఏర్పడుతుంది. అలా కొంతకాలం తరువాత తన భార్య నగలు ఆమెకు ఇచ్చి ధరించి రమ్మని చెప్పాడు అప్పుడు ధరించాక ఆమె అందం మరింత పెరిగింది. ఆమె చిత్రాన్ని కూడా గీయించాడు అది చూసిన తన మెనల్లులు, మేనకోడల్లు ఆమె మీద ఆసుయ పెరిగింది వారు ఆస్తి గురించి కూడా కరనోవర్ నీ అడుగుతారు అప్పుడు కరనోవర్ ఈమేను నేను పెళ్లి చేసుకొని మాకు పుట్ట బోయే వారికి ఇస్తాను అన్నాడు అప్పుడు వారికి విపరీతమైన కోపం వస్తుంది. ఒక పని మనిషికి పుట్టబోయే వారికి అస్థి ఇస్తాడా అని, ఆస్తి ఎలా అయిన సరే వాలకూ దక్కకుడదు అని కరనోవర్ ని చంపడానికి ప్లాన్ చేస్తారు.

అలు మూట్టిల్ మేడ చాలా విశాలవంతమైనది. ఒకేసారి 2000 మంది కూర్చునే ప్రదేశం గ్రౌండ్ ఫ్లోర్ లో కలదు. ఇంత ఆస్తి పని మనిషి పిల్లలకు దక్కకుడదని మేనల్లులు కరనోవర్ నిద్రపోతున్న సమయంలో తన తల నరికి వేస్తారు ఏటువంటి సాక్షం లేకుండా ఆ పనిమనిషిని కూడా చంపేసి ఆ ఇంటిలో వున్న బంగారం, డబ్బులు అన్ని తీసుకొని పారిపోయారు, అక్కడ పనిచేసే మనుషులు కూడా కాలి చేసి వెళ్ళిపోతారు. కొంతకాలానికి దోషులు ఎవరో తెలిశాక వారికి అక్కడే ఊరి వేస్తారు ఇక ఆ బంగ్లా పాతదై పోతుంది ఒక దయ్యాల కొంపల తయారవుతుంది. కొంత మంది అక్కడ వుండే వారు రాత్రి పూట ఏదో పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి అని అంటూ వుండే వారు ఇంకా అక్కడ కొన్ని ఆత్మలు వున్నాయి అని అంటు వుండేవారు. ఇంకా ఎప్పుడైతే చంద్రముఖి సినిమా రిలజ్ అయ్యాక అప్పటి నుంచి మరల ప్రజల దృష్టి ఈ ఇంటిమీద పడింది యెంతో మంది వచ్చి ఆ ప్రదేశాన్ని, ఇల్లు నీ తండోప తండాలుగా చూడడానికి తరలి వచ్చేవారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది