change in the acharya film release date official announcement by makers
Acharya Movie : టాలీవుడ్ మెగాస్టార్ ‘ఆచార్య’ విడుదల తేదీలో మార్పు వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆత్రంగా వెయిట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చి 25న విడుదల అవుతున్న నేపథ్యంలో హెల్దీ అట్మాస్పియర్ క్రియేట్ చేయడంలో భాగంగా ‘ఆచార్య’ విడుదల తేదీలో మార్పు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ మేరకు వారు ట్విట్టర్ వేదికగా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.‘ఆచార్య’ చిత్ర విడుదల తేదీ గురించి ఇప్పటికే చాలా సార్లు మార్పులు జరిగాయి. కాగా, ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ రిలీజ్ నేపథ్యంలో మరోసారి మార్పు జరిగింది.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కనిపించనున్నారు. ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ను చెర్రీ ఈ చిత్రంలో పోషించాడు. ఆయనకు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ, బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత ప్రేక్షకులకు వెండితెరపైన ఈ చిత్రంలోనే కనిపించనున్నారు. మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది.
change in the acharya film release date official announcement by makers
ఈ చిత్రంలో బ్యూటిఫుల్ రెజీనా కసాండ్రా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ లిరిక్స్ అందించారు. ‘శానా కష్టం వచ్చేసింది మందాకిని’ అనే సాంగ్ ఇటీవల విడుదలై కాగా, ప్రేక్షకుల నుంచి పాటకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో తండ్రీ తనయులు మావోయిస్టులుగా కనిపించబోతున్నట్లు పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంద. చిరు, చరణ్‌లను ఒకే ఫ్రేమ్ లో చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటారని ‘ఆచార్య’ మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.