Acharya Movie : చిరంజీవి ‘ఆచార్య’ విడుదల తేదీలో మార్పు.. మేకర్స్ అధికారిక ప్రకటన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acharya Movie : చిరంజీవి ‘ఆచార్య’ విడుదల తేదీలో మార్పు.. మేకర్స్ అధికారిక ప్రకటన

 Authored By mallesh | The Telugu News | Updated on :31 January 2022,8:00 pm

Acharya Movie : టాలీవుడ్ మెగాస్టార్ ‘ఆచార్య’ విడుదల తేదీలో మార్పు వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆత్రంగా వెయిట్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చి 25న విడుదల అవుతున్న నేపథ్యంలో హెల్దీ అట్మాస్పియర్ క్రియేట్ చేయడంలో భాగంగా ‘ఆచార్య’ విడుదల తేదీలో మార్పు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ మేరకు వారు ట్విట్టర్ వేదికగా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.‘ఆచార్య’ చిత్ర విడుదల తేదీ గురించి ఇప్పటికే చాలా సార్లు మార్పులు జరిగాయి. కాగా, ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ రిలీజ్ నేపథ్యంలో మరోసారి మార్పు జరిగింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కనిపించనున్నారు. ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ను చెర్రీ ఈ చిత్రంలో పోషించాడు. ఆయనకు జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ, బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత ప్రేక్షకులకు వెండితెరపైన ఈ చిత్రంలోనే కనిపించనున్నారు. మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది.

change in the acharya film release date official announcement by makers

change in the acharya film release date official announcement by makers

Acharya Movie : ఏప్రిల్ 29న ‘ఆచార్య’.. మెగా అభిమానులకు ఇక పండుగే..

ఈ చిత్రంలో బ్యూటిఫుల్ రెజీనా కసాండ్రా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ లిరిక్స్ అందించారు. ‘శానా కష్టం వచ్చేసింది మందాకిని’ అనే సాంగ్ ఇటీవల విడుదలై కాగా, ప్రేక్షకుల నుంచి పాటకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో తండ్రీ తనయులు మావోయిస్టులుగా కనిపించబోతున్నట్లు పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంద. చిరు, చరణ్‌లను ఒకే ఫ్రేమ్ లో చూసి మెగా అభిమానులు పండుగ చేసుకుంటారని ‘ఆచార్య’ మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది