Charmy Kaur : ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా రాణిస్తుంది. జీవితంలో ఆమె తీరని కష్టాలు, వైఫల్యాలు, ఆర్ధిక ఇబ్బందులు, అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంత కష్టం వచ్చినా పూరితో ప్రయాణాన్ని ఆమె ఆపలేదు. ఈ పంజాబీ బ్యూటీ 2002లో నీ తోడు కావాలని సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపక్ హీరోగా చేశాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఛార్మి. జ్యోతి లక్ష్మి అనే సినిమాలో నటించి మరోసారి తనఖాతాలోసూపర్ హిట్ ను వేసుకుంది. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో వేశ్య పాత్రలో నటించి ఛార్మి అదరగొట్టింది.
పూరి కనెక్ట్స్ బ్యానర్ లో భాగస్వామిగా ఛార్మి చిత్రాలు నిర్మించారు. ఛార్మి నిర్మాతగా రోగ్, పైసా వసూల్, మెహబూబ్ చిత్రాలు నిర్మించారు. ఇవన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పూరి, ఛార్మి ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఛార్మి నటిగా సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకుంది. ఇప్పుడు ఏకంగా లైగర్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మి కలిసి నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లలో ఛార్మీ హంగామా మామూలుగా లేదు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.
ఛార్మి కెరియర్ సక్సెస్ ఫుల్‌గానే సాగుతున్నా పర్సనల్ లైఫ్ మాత్రం ఎందుకో డిస్ట్రబ్ అయినట్టు తెలుస్తుంది. అప్పట్లో ఛార్మి ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపించిందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కాని పెళ్లి సమయం వచ్చే సరికి అతను ఛార్మికి హ్యాండ్ ఇచ్చాడట. దీంతో అప్పటి నుండి ఛార్మి పెళ్లికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో ఛార్మి దశ తిరిగింది. కోల్పోయినవన్నీ మరలా పొందారు. హిట్ ట్రాక్ ఎక్కిన పూరీకి విజయ్ దేవరకొండ మూవీ ఛాన్స్ ఇచ్చారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.