Chinmayi : ప్రధాని పోస్ట్ వేస్ట్ అంటున్న చిన్మయి.. పరువు తీసేసింది.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chinmayi : ప్రధాని పోస్ట్ వేస్ట్ అంటున్న చిన్మయి.. పరువు తీసేసింది..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 March 2022,9:00 pm

Chinmayi : చిన్మయి.. ఈ పేరు చాలా మందికి తెలుసు ఆమె పాడిన పాటలు చాలా మంది మనస్సు దోచుకున్నాయి. ఇక ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఇక తాజాగా తన ఫాలోవర్లతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. నెటిజన్ అడిగిన అనేక ప్రశ్నలకు చాలా ఓపికగా ఆన్సర్స్ ఇచ్చింది. ఇక కొందరు ఆమె పర్సనల్ విషయాలను సైతం అడిగారు. మరి కొందరు ఆమె లవ్ మ్యాటర్, మ్యారేజ్ కు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చింది చిన్మయి. కొందరి సమస్యలకు సొల్యూషన్స్ సైతం ఇచ్చింది.

కొందరు తమ జీవితంలో ఎదుర్కొన్న లైంగికదాడి విషయాలను సైతం చెప్పుకొచ్చారు. అలాంటి విషయాలను మాట్లాడేందుకు ధైర్యం ఇచ్చింది మీరేనంటూ చిన్మయిని కొనియాడారు.ముచ్చిటిస్తున్న క్రమంలో ఓ నెటిజన్ చిన్మయితో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఈ దేశానికి మీరే పీఎం కావాలంటూ ఓ మహిళ మెసెజ్ చేసింది. దీనిని చూసి కాసేపు నవ్వుకున్న చిన్మయి.. తర్వాత అందుకు బదులిచ్చింది. ప్రధానమంత్రి అవ్వడం అంత సులువు కాదని చెప్పుకొచ్చింది. ప్రపంచంలో అత్యంగా వరస్ట్ అండ్ టఫెస్ట్ పదవి అదేనని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Chinmayi as the Prime Minister Post Waste says

Chinmayi as the Prime Minister Post Waste says

Chinmayi : ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్

మరి ఇంతకు ప్రధాని పదవిని ఆమె పొగిడిందా..? లేక చీప్ చేసి మాట్లాడిందా..? అంటూ నెటిజన్స్ డైలమాలో పడ్డారు. ఇక ఆమె ఎదుర్కొన్న ట్రోల్స్ పై ప్రశ్నించారు. ట్రోల్స్ ను ఎలా ఫేస్ చేస్తారు అని అడిగారు. అందుకు చిన్మయి బదులిస్తూ అలాంటి వాటిని తాను పట్టించుకోనని.. బాధపడాల్సిన అవసరమే లేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు ఇచ్చిన ఆన్సర్లకు చాలా మంది ఫిదా అవుతున్నారు. యూ ఆర్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Chinmayi as the Prime Minister Post Waste says

Chinmayi as the Prime Minister Post Waste says

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది